Moeen Ali: ఇంగ్లండ్‌తో కష్టమే.. భారత్ జాగ్రత్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, ఇంగ్లండ్ మధ్య రేపటి (జులై 1) నుంచి ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ మోయిన్ అలీ భారత్‌ను హెచ్చరించాడు. ఇంతకుముందు కంటే ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు పటిష్టంగా తయారైందని, ఇటీవల న్యూజీల్యాండ్ను 3-0తో క్లీన్‌స్వీప్ ఆ జట్టు మరింత జోష్ మీద ఉందని, అలాంటి ఇంగ్లండ్‌ను ఆపడం చాలా కష్టమేనని అభిప్రాయపడ్డాడు.
ఒకవేళ గతేడాదే ఈ ఐదో టెస్ట్ మ్యాచ్ జరిగి ఉంటే, టీమిండియాకే అనుకూలమైన ఫలితం వచ్చేదని.. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవని అంచనా వేశాడు.ఇప్పుడున్న ఇంగ్లండ్ జట్టు లోడెడ్ గన్లా తయారైందని, ఎవరెదురెళ్లినా దాని ఫైరింగ్ ముందు నిలబడలేరని మోయిన్ చెప్పాడు. దీనికితోడు రోహిత్ శర్మ, కేఎల్ శర్మ దూరం అవ్వడం.. భారత్‌కు మరింత మైనస్ అవుతుందన్నాడు. గతేడాదితో పోలిస్తే ఇంగ్లండ్ మైండ్‌సెట్ పూర్తిగా మారిందని, ఎదురుదాడినే ప్రధాన అస్త్రంగా వినియోగిస్తుందని తెలిపాడు. రేపట్నుంచి జరగబోయే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టే ఫేవరెట్ అని మోయిన్ అలీ జోస్యం చెప్పాడు.
Also Read
- Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
- Shahrukh Khan: చరిత్ర సృష్టించిన 'షారుఖ్' నైట్ రైడర్స్.. సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు!
- Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
- Ishan Kishan-Abhishek Sharma: అభిషేక్ శర్మ తప్పు లేదు.. ఇషాన్ కిషన్ చూసుకోవాలి కదా!
కాగా.. గతేడాది జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్‌ను కరోనా కారణంగా ఈ ఏడాది రీషెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే! ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఇండియా గెలిచినా, డ్రాగా ముగిసినా.. భారత్‌దే సిరీస్ కైవసం అవుతుంది. అలా కాకుండా చేయాలంటే, ఇంగ్లండ్ తప్పకుండా ఈ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. అప్పుడు సిరీస్ 2-2తో సమం అవుతుంది. మరి.. ఎలాంటి ఫలితం నమోదవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
-
Murder Case: ‘నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు’.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?