భారత్, ఇంగ్లండ్ మధ్య రేపటి (జులై 1) నుంచి ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ మోయిన్ అలీ భారత్‌ను హెచ్చరించాడు. ఇంతకుముందు కంటే ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు పటిష్టంగా తయారైందని, ఇటీవల న్యూజీల్యాండ్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ ఆ జట్టు మరింత జోష్ మీద ఉందని, అలాంటి ఇంగ్లండ్‌ను ఆపడం చాలా కష్టమేనని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ గతేడాదే ఈ ఐదో టెస్ట్ మ్యాచ్ జరిగి ఉంటే, టీమిండియాకే అనుకూలమైన ఫలితం వచ్చేదని..…