అండర్-19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్లు దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే మన జట్టు ఫైనల్ చేరుకుంది. శనివారం సాయంత్రం ఇంగ్లండ్, భారత్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వెస్టిండీస్ ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా కుర్రాళ్లు కప్ గెలవాలంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్‌బాబు కూడా ఉన్నాడు.
Read Also: టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత యువ జట్టుకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని మహేష్‌బాబు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. ఈ మేరకు పోరాడండి.. స్వదేశానికి ట్రోఫీని తీసుకురండి అంటూ మహేష్ పిలుపునిచ్చాడు. అటు ఈ టోర్నీలో భారత టీం చక్కగా ఆడిందని, ఫైనల్లోనూ ఇదే కొనసాగించాలని పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆకాంక్షించాడు. అటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా భారత కుర్రాళ్ల కోసం వీడియో సందేశం విడుదల చేశాడు. వంద కోట్ల మంది మీ వెనుక ఉన్నారు… టీమిండియా కోసం మెరుగైన ప్రదర్శన చేయాలంటూ సచిన్ తన వీడియోలో పిలుపునిచ్చాడు.