ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ రెండో విజయం నమోదు చేసింది. అటల్ బిహారి వాచ్ పేయి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. ఇక ఈ ఘన విజయంపై మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించారు. ఈ అద్భుతమైన విజయానికి కారణం తమ జట్టు స్పిన్నర్లే అని రాహుల్ అన్నారు. ఈ మ్యాచ్ లో స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. కృనాల్ పాండ్యా మూడు వికెట్లతో ఎస్ ఆర్ హెచ్ టాప్ ఆర్డర్ ను దెబ్బతీశాడు.. మిశ్రా రెండు, రవి బిష్ణోయ్ ఒక వికెట్ పడగొట్టారు. రాహుల్ కీలక సమయాల్లో స్పిన్నర్లను ఊపయోగించి సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఏ దశలోను కోలుకోకుండా చేశాడు.
Also Read : Allu Arjun: సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఎత్తిన ప్రతి వేలు ముడుచుకునేలా చేశాడు…
లక్నో వికెట్ పరిస్థితి ఎలా ఉందో మాకు ఒక రోజు ముందే అర్థమైంది.. గత రెండు వారాలుగా మేము ఇక్కడే ఉన్నామని కేఎల్ రాహుల్ అన్నారు. కాబట్టి ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు బాగా తెలుసు.. ఒక వేళ నేను టాస్ గెలిచి తొలుత బౌలింగే ఎంచుకునే వాడిని.. ఇక్కడ ఎలా ఆడాలో నాకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. మొదటి రెండు ఓవర్లలో పేసర్లకు బంతి అద్భుతంగా టర్న్ అవ్వడం గమనించాను.. జయదేవ్ ఉనద్కట్ వేసిన కొన్ని బంతులు అనూహ్యంగా అయ్యాయి. అటువంటి సమయంలో స్పిన్నర్లను తీసుకువస్తే బంతి మరింత టర్న్ అవుతుంది అని నేను భావించాను అని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నారు. అందుకే కృనాల్ పాండ్యా చేతికి బంతిని ఇచ్చాను.. అతడు అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఇక లక్నో వంటి వికెట్ పై చాలా తేలికగా బ్యాటింగ్ చేయాలి.. మేము ఈ మ్యాచ్ లో ఒక యూనిట్ గా ముందుకు సాగిపోయాం.. అందుకే గెలిచాం.. రాబోయే మ్యాచ్ ల్లో ఇదే రిపీట్ చేస్తాము అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.
Also Read : Today Business Headlines 08-04-23: బిజినెస్‌కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం. మరిన్ని వార్తలు
