ఐపీఎల్-2023లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో పోరుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. సొంత మైదానంలో టైటాన్స్ ను ఢీ కొట్టేందుకు ధావన్ సేన సన్నదమవుతుంది. పవర్ హిట్టర్.. ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్ స్టోన్ రాకతో పంజాబ్ కింగ్స్ లో జోష్ వచ్చింది. తమ స్థార్ ప్లేయర్ వచ్చేశాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అందరి కళ్లు అతడిపై ఉన్నాయంటూ కింగ్స్ టీమ్ లివింగ్ స్టోన్ ఫోటోలను షేర్ చేసింది. కాగా గాయం కారణంగా సుదీర్ఘకాలం పాటు ఆటకు దూరమైన లివింగ్ స్టోన్ ఈ మ్యాచ్ తో బరిలోకి దిగనున్నాడు. మరో వైపు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లోనే అందుబాటులోకి వచ్చినప్పటికి బెంచ్ కే పరిమితమైన సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ కూడా గుజరాత్ తో జరిగే మ్యాచ్ లో ఆడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ తుది జట్టు ఎలా ఉండబోతుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది.
Read Also : Kolkata Metro: నీటి అడుగున ట్రయల్ రన్.. చరిత్ర సృష్టించిన కోల్కతా మెట్రో
ఓపెనర్లుగా ప్రబ్ సిమ్రన్ సింగ్, కెప్టెన్ శిఖర్ ధావన్ జోడీ కొనసాగనుండగా.. లివింగ్ స్టోర్ ను వన్ డౌన్ లో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక భనుక రాజపక్స స్థానంలో గత మ్యాచ్ లో వన్ డౌన్ లో వచ్చిన మాథ్యూ షార్ట్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. అదే విధంగా ఆశించిన స్థాయలో రాణించలేకపోతున్న సికందర్ రజాకు ఇదే లాస్ట్ చాన్స్ అయ్యే అవకాశం ఉంది. మిడిలార్డర్ లో షారుక్ ఖాన్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ, హర్ ప్రీత్ బ్రార్ ఆడనున్నారు. వీరితో పాటు సామ్ కర్రన్ ఉన్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో పేసర్లు కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్ లలో ఒకరు.. అర్షదీప్ సింగ్ తో పాటు స్పిన్నర్ రాహుల్ చహర్ తుది జట్ుటలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
Read Also : Kisha reddy: తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసు.. కేటీఆర్ పై కిషన్ రెడ్డి సెటైర్లు..!
అయితే గత మ్యాచ్ లో శిఖర్ ధావన్ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో సన్ రైజర్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ కు ఓటమి తప్పలేదు. మరోవైపు గుజరాత్ కు సైతం గత మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ రూంలో సీజన్ లో తొలి ఓటమి ఎదురైంది. దీంతో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. కాగా ఇవాళ్టి మ్యాచ్ జరుగనున్న మొహాలీ స్టేడియంలో గతంలో ఇరు జట్లు తలపడిన రెండు సార్లు చెరో విజయం సాధించాయి.
Read Also : KA Paul: సింగరేణిని కొనలేని వాళ్లు విశాఖను కొంటారా?
పంజాబ్ కింగ్స్ : ప్రబ్ సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్, లివింగ్ స్టోన్, సికిందర్ రజా, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, సామ్ కర్రన్, హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, నాథన్ ఎల్లిస్/కగిసో రబాడ, అర్షదీప్ సింగ్.
గుజరాత్ టైటాన్స్ : వృద్దిమాన్ సాహా, శుబ్ మన్ గిల్, సాయి సుదర్శన్, హార్థిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, జాషవా లిటిల్.
