Kishan reddy: తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు. రోజ్ గార్ మేళాలో పాల్గొన్న ఆయన దేశ వ్యాప్తంగా 71 వేల మందికి ప్రధాని మోడీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నారని తెలిపారు. వర్చువల్ గా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అన్నారు. 12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఈ రోజు మరో 71 వేల మందికి కేంద్ర ప్రభుత్వం లో సేవ చేసే అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. మన యువత ప్రపంచంని శాసిస్తుందని తెలిపారు. 2047 వరకు మన దేశం విశ్వగురువుగా ఎదగాలని అన్నారు. అమెరికా లాంటి దేశాలకు సెల్ పోన్ లు ఎగుమతి చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వంలో మంజూరు అయిన పోస్ట్ లను భర్తీ చేయాలని నిర్ణయమన్నారు. ఆగస్ట్ లోపల అన్ని ఖాళీల భర్తీ చేయాలని లక్ష్యంతో ముందడుగు వేస్తున్నామని తెలిపారు.
ఎందులో ముందుంది?
తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసని మంత్రి కేటీఆర్ ట్వీట్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అవినీతిలో, నియంతృత్వంలో, అహంకార కుటుంబ మాఫియా పాలనలో, అక్రమ లిక్కర్ కేసుల్లో ముందు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం అడ్డంగా మాట్లాడుతూ తొండి అట ఆడుతుందని విమర్శించారు. ఉద్యోగ నియామకాలు కూడా చేయాలేని అసమర్ధ ప్రభుత్వం ఇది అని కీలక వ్యాఖ్యలు చేశారు. మీ నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఏంటో ప్రజలు తెలుస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ఉట్టికి ఎగరనొడు ఆకాశానికి ఎగురుటనట్టు ఉంది.. విశాఖ స్టీల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు అంటూ ఎద్దేవ చేశారు. విశాఖ స్టీల్ ను సింగరేణి నుండి కొంటారు అట అని చురకలంటించారు. అదే సింగరేణి నీ ప్రైవేట్ పరం చేయొద్దని ఆందోళన చేస్తారని మండిపడ్డారు. ప్రధాని వస్తె నిరసనలు చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వం దే అని చెప్పిన తప్పుడు ప్రచారం, నాటకాలు అడారని ఆరోపించారు. అబద్ధాలు, బురద జల్లడం అలవాటు అయిందని మండిపడ్డా్రు. ఏ సంస్థ పైన (మార్గదర్శి) అక్రమంగా దాడులు జరపొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 9 సంవత్సరాలు గా సెక్రటేరియట్ కు రాని ముఖ్యమంత్రులు ఉన్నారని తెలిపారు.
Traffic diversion: బీపీపీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు.. అటు పార్కులు, రెస్టారెంట్లు బంద్..