ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫైనల్ లో న్యూజీలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ మూడోసారి గెలుచుకున్న జట్టుగా హిస్టరీ క్రియేట్ చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ రెండోసారి ICC ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయంలో జట్టులోని ఆటగాళ్లు అందరు కీలక పాత్ర పోషించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్టంప్స్ తీసుకుని గ్రౌండ్ లో దాండియా నృత్యం చేశారు. విజయం తర్వాత కోహ్లీ తన భార్య అనుష్క శర్మ వద్దకు వెళ్లి ఆమెను కౌగిలించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి.
Also Read:IND vs NZ: రోహిత్ ఖాతాలో మరో “హిట్టు”.. భారత్ ఘన విజయం..
హగ్ చేసుకున్న తర్వాత ఆటగాళ్లు సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న మైదానానికి అనుష్కను తీసుకువచ్చాడు. టీమిండియా విజయం తర్వాత విరాట్, అనుష్క మధ్య ఒక ప్రేమకథ కనిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను చూసేందుకు అనుష్క శర్మ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి వచ్చింది. భారత్ గెలుపు తర్వాత విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గ్యాలరీ నుంచి దిగి మైదానం వైపు రావడం ప్రారంభించింది. తర్వాత విరాట్ అనుష్క వైపు పరిగెత్తి మెట్లపై తన భార్యను కౌగిలించుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుంటూ మెట్లపై కొంతసేపు నిలబడ్డారు.
Also Read:
AICC: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. సినీ నటికి అవకాశం!
ఆ తర్వాత కోహ్లీ అనుష్క చేయి పట్టుకుని కిందికి తీసుకువచ్చాడు. ఇద్దరూ కలిసి టైటిల్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. విరుష్క ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కాగా విరాట్ ఫైనల్లో రానించలేదు.. కానీ పాకిస్తాన్ పై సెంచరీ, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అర్ధ సెంచరీ మర్చిపోలేనివి. ఫైనల్లో భారత్ 49 ఓవర్లలో 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
This moment!🏆❤️#AnushkaSharma hugged #ViratKohli after India's epic win in the #ICCChampionsTrophy2025 finals. #INDvsNZ pic.twitter.com/QmEDAJcziu
— Filmfare (@filmfare) March 9, 2025