ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం రాజస్తాన్ రాయల్స్, కలకత్తా నైట్ రైడర్స్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల చేసి కేకేఆర్ ముందు భారీ స్కోరు నిలిపింది. జాస్ బట్లర్(61 బంతుల్లో 103, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సీజన్‌లో రెండో సెంచరీ సాధించగా.. సంజూ శాంసన్ 38 పరుగులు చేశాడు. ఇక చివర్లో హెట్‌మైర్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులతో మెరిశాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి, పాట్ కమిన్స్, రసెల్ తలా ఒక వికెట్ తీశారు.