Khurram Manzoor: కోహ్లీపై మాట మార్చిన పాక్ క్రికెటర్.. అప్పుడు తుస్సు, ఇప్పుడు తోపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khurram Manzoor Gives Clarity On His Comments On Virat Kohli: ఇటీవలే విరాట్ కోహ్లీ కంటే తానే బెటరంటూ గొప్పలు పోయిన పాక్ వెటరన్ క్రికెటర్ ఖుర్రమ్ మంజూర్.. ఇప్పుడు మాట మార్చేశాడు. కోహ్లీతో తనకు పోలికేంటి? అంటూ రివర్స్ గేర్ వేశాడు. తాను చేసిన వ్యాఖ్యల్ని మీడియా వాళ్లు వక్రీకరించారని, కోహ్లీని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని పేర్కొన్నాడు. కేవలం తన విజయాల గురించి చెప్పుకోవడానికి మాత్రమే కోహ్లీతో పోల్చుకున్నానే తప్ప.. కోహ్లీని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నాడు. విరాట్ కోహ్లీని తాను ఆరాధిస్తానని, ఈ తరానికి అతడొక గొప్ప ప్లేయర్ అంటూ చెప్పుకొచ్చాడు.
Journalist Tortured: జర్నలిస్టుని చెట్టుకు కట్టేసి టార్చర్.. ఎందుకో తెలుసా?
Also Read
- IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
అసలేం జరిగిందంటే.. రీసెంట్గా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ తనకంటే గొప్పేమీ కాదంటూ ఖుర్రమ్ మాట్లాడాడు. ఇప్పుడున్న టాప్ 10 వన్డే బ్యాటర్లలో తానే వరల్డ్ నంబర్ వన్ అని.. తన తర్వాతే విరాట్ కోహ్లీ ఉన్నాడని చెప్పాడు. కోహ్లీ ప్రతి ఆరు ఇన్నింగ్స్‌లకు ఓ సెంచరీ సాధించాడని, తాను మాత్రం 5.68 ఇన్నింగ్స్‌లకే సెంచరీ చేశానని పేర్కొన్నాడు. ఇదే ప్రపంచ రికార్డ్ అని జబ్బలు కొట్టుకున్నాడు కూడా! దాదాపు పదేళ్లపాటు 53 సగటుతో తాను పరుగులు సాధించానని, లిస్ట్ – A క్రికెట్‌కు సంబంధించి తాను ప్రపంచంలోనే ఐదో ర్యాంక్‌లో ఉన్నానని అన్నాడు. గత 48 ఇన్నింగ్స్‌ల్లో తాను 24 సెంచరీలు నమోదు చేశానన్నాడు. ఈ విధంగా తనని తాను గొప్పగా చెప్పుకోవడం కోసం కోహ్లీ పేరుని ప్రస్తావించడంతో.. ఖుర్రమ్పై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే అతడు ట్విటర్ మాధ్యమంగా తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చాడు.
Dead Body In Truck: లారీలో డెడ్ బాడీ.. షాక్‌కు గురైన ఓనర్
‘‘నా ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయి. నేను విరాట్ కోహ్లీని తక్కువ చేసి మాట్లాడలేదు. ఈ తరానికి అతడు ఒక గొప్ప ప్లేయర్. ఓ ఆటగాడిగా అతడ్ని నేను ఆరాధిస్తాను. లిస్ట్ ఏ క్రికెట్లో సెంచరీల నిష్పత్తి గురించి మాట్లాడుతూ.. కోహ్లి కంటే నా గణాంకాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. అతడు రెండో స్థానంలో ఉన్నాడని మాత్రమే చెప్పా. అసలు అతనితో నాకు పోలికే లేదు. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. అతని గణాంకాలతో సంబంధం లేదు. కోహ్లీ ఎప్పటికీ గొప్ప క్రికెటరే’’ అని ఖుర్రమ్ మంజూర్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ తన తన గణాంకాలకు సంబంధించిన ఫొటోను జత చేసిన ఖుర్రమ్.. ఇకనైనా మీడియా సంస్థలు విచక్షణతో వ్యవహరించాలని చురకలంటించాడు.
Anurag Thakur: ఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌ను తరిమికొడదాం.. కేంద్రమంత్రి ప్రతిజ్ఞ
తాజావార్తలు
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?