Journalist Tortured: జర్నలిస్టుని చెట్టుకు కట్టేసి టార్చర్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Journalist Tied To Tree Slapped And Punched In Madhya Pradesh: అతడు ఒక జర్నలిస్ట్.. ఎప్పట్లాగే తన విధులు నిర్వర్తించుకొని ఇంటికి బయలుదేరాడు. గ్రామానికి చేరుకునేంత వరకు క్షేమంగానే చేరుకున్నాడు. కానీ.. ఇంతలోనే ఓ యువకుడు అడ్డగించి, అతనిపై దాడి చేయబోయాడు. ఆ తర్వాత మరో ఇద్దరు రంగంలోకి దిగి, అతనిపై ఎటాక్ చేశారు. చెట్టుకు కట్టేసి మరీ దారుణంగా హింసించారు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశ్ యాదవ్ అనే ఓ యువకుడు ఒక టీవీ ఛానెల్, ఆన్‌లైన్ న్యూస్ ఔట్‌లెట్‌కు జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాడు. తన విధులు నిర్వర్తించిన అనంతరం.. తన స్వగ్రామం కోట్‌గావ్‌కి ద్విచక్రవాహనంలో బయలుదేరాడు.
Anurag Thakur: ఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌ను తరిమికొడదాం.. కేంద్రమంత్రి ప్రతిజ్ఞ
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఇంతలో నారాయణ్ యాదవ్ అనే ఓ వ్యక్తి ప్రకాశ్ బండిని అడ్డగించాడు. అప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నారాయణ్ బూతులు తిడుతూ ప్రకాశ్‌పై చెయ్యి చేసుకోబోయాడు. ప్రకాశ్ అతడ్ని అడ్డుకోబోతో.. ఇంతలోనే నారాయణ్ సోదరుడు నరేంద్ర యాదవ్, ఓమ్ ప్రకాశ్ అనే మరో వ్యక్తి అక్కడికి చేరుకున్నారు. ఆ ముగ్గురు ప్రకాశ్‌ని రౌండప్ చేసి కొట్టారు. అంతటితో ఆగకుండా.. ఓ చెట్టుకు కట్టేసి, చెంపలు పగలగొట్టారు. అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. అనంతరం అతని కట్టు విప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అనంతరం ప్రకాశ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. కొన్ని వారాల క్రితం ఓ అవనసరమైన విషయంపై తమ మధ్య జరిగిన వాగ్వాదానికి ప్రతీకారంగానే తనని ఆ ముగ్గురు ఇలా కట్టేసి కొట్టారని ప్రకాశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Dead Body In Truck: లారీలో డెడ్ బాడీ.. షాక్‌కు గురైన ఓనర్
కాగా.. తన ఫిర్యాదులో ప్రకాశ్ పేర్కొన్న ఆ వాగ్వాదానికి సంబంధించి గతంలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఎవరైతే వాగ్వాదానికి దిగారో.. వాళ్లే ఆ వీడియోని రికార్డ్ చేశారు. తామేదో గొప్ప పని చేస్తున్నామన్న ఉద్దేశంతో ఆ పని చేశారు. కానీ.. అదే వాళ్లను జైలుపాలు చేసింది. ఆ ఘటనపై కేసు నమోదవ్వగా.. పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు ఇప్పుడు ప్రకాశ్‌పై మళ్లీ ఆ వాగ్వాదం విషయంపైనే దాడి చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా.. చర్యలు తీసుకుంటున్నారు.
Jairam Ramesh: ప్రతిపక్ష కూటములకు జైరాం ట్విస్ట్.. బీజేపీపై పోరుకి కాంగ్రెసే పెద్ద దిక్కు
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!