Anurag Thakur Pledged To Uproot Arvind Kejriwal From Delhi: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ శనివారం బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఢిల్లీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, వారి అవినీతిని బీజేపీ త్వరలోనే బహిర్గతం చేస్తుందని కుండబద్దలు కొట్టారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తాను ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ప్రచారం చేశానని, ప్రజలపై కేజ్రీవాల్ ప్రభుత్వం మాయాజాలం తగ్గిపోవడాన్ని తాను గుర్తించానని అన్నారు. ఎన్నికల్లో భాగంగా ఆ పార్టీకి వచ్చిన తక్కువ మెజారిటీని అందుకు ప్రత్యక్ష సాక్ష్యమని చెప్పారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదే తమ తీర్మానమని.. 2024, 2025 ఎన్నికల్లో విజయం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు.
Snake In Toilet : అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చింది.. డోర్ ఓపెన్ చేయగానే షాక్
మోడీ ప్రభుత్వం ఢిల్లీలో గత 8 సంవత్సరాలలో.. మౌలిక సదుపాయాల నుండి కాలుష్యంపై పోరాడటానికి రూ.1 లక్ష కోట్ల కంటే ఎక్కువ విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను అందించిందని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, డీడీఏ, లెఫ్టినెంట్ గవర్నర్ మార్గదర్శకత్వంలో.. యమునా రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను ప్రజల ముందుంచాలన్నారు. నజఫ్‌గఢ్ డ్రెయిన్‌పై లెఫ్టినెంట్ గవర్నర్ చేపడుతున్న పనుల కారణంగా అది ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారుతోందన్నారు. కానీ.. ఢిల్లీ ప్రభుత్వం మాత్రం భారీ అవినీతి, నిర్లక్ష్యానికి పాల్పడిందని ఆరోపించారు. గత ఎనిమిదేళ్లలో యమునా నదిని ఢిల్లీ ప్రభుత్వం మురికిగా మార్చిందని, కేంద్ర ప్రభుత్వం యమునా ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. వాయు కాలుష్యంపై పోరాడేందుకు, కేంద్ర ప్రభుత్వం FAME పథకం కింద ఢిల్లీకి 150 ఎలక్ట్రిక్ బస్సులను ఇచ్చిందన్నారు. కోవిడ్ -19 కాలం నుండి.. వలస వచ్చిన వారితో పాటు ఢిల్లీలోని 60 లక్షల మందికి పైగా పేదలకు మోడీ ప్రభుత్వం ఉచిత రేషన్ ఇస్తోందన్నారు. అయితే.. ఢిల్లీ ప్రభుత్వం పేదలకు ఇంత ఉచిత రేషన్ కూడా ఇవ్వకపోవడం బాధాకరమని కేంద్రమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Jairam Ramesh: ప్రతిపక్ష కూటములకు జైరాం ట్విస్ట్.. బీజేపీపై పోరుకి కాంగ్రెసే పెద్ద దిక్కు
ఈ నేపథ్యంలోనే.. ఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను తరిమికొడదామని అనురాగ్ ఠాకూర్ ప్రతిజ్ఞ చేశారు. ఇదే సమయంలో ఆయన బీజేపీ చరిత్రలో ఢిల్లీ ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పారు. బీజేపీ చరిత్రలో ఢిల్లీకి ఒక ముఖ్యమైన స్థానం ఉందని.. జనసంఘ్ కాలం నుండి ఢిల్లీ ఎల్లప్పుడూ బీజేపీకి మద్దతు ఇస్తుందని అన్నారు. ఢిల్లీలో కార్యకర్తల కొరత గానీ, నాయకత్వం కొరత గానీ లేదన్నారు. ఢిల్లీ వర్కర్స్.. అవినీతిమయం, అస్తవ్యస్తమైన అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిలీ నుంచి, అలాగే దేశం నుంచి తరిమికొట్టాలన్న కొత్త తీర్మానం తీసుకోవాలని ఠాకూర్ పిలుపునిచ్చారు.
Chahat Khanna: సుకేశ్‌పై టీవీ నటి బాంబ్.. ట్రాప్ చేసి, జైలుకి పిలిపించి..