IPL Mega Auction: అండర్-19 ఆటగాళ్లకు జాక్‌పాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల వెస్టిండీస్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమిండియా ఆటగాళ్లకు ఐపీఎల్ మెగా వేలంలో జాక్‌పాట్ తగిలింది. అండర్-19 టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు దక్కించుకుంది. అటు ఆల్‌రౌండర్ రాజ్ బవాను పంజాబ్ కింగ్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. రాజ్ బవా మీడియం పేస్ బౌలింగ్ వేయగలడు. అంతేకాకుండా మిడిల్ ఓవర్లలో పరిస్థితులకు అనుకూలంగా బ్యాటింగ్ కూడా చేయగలడు. అందుకే పంజాబ్ కింగ్స్ అతడిని రూ.2 కోట్లకు దక్కించుకుంది.
అండర్-19 టీమిండియాకు చెందిన మరో ఆల్ రౌండర్ రాజ్ వర్ధన్ హంగార్గేకర్‌ను రూ.1.5 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ చేజిక్కించుకుంది. హంగార్గేకర్ టీనేజ్ వయసులోనే స్పీడ్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వేగంగా బంతులు విసరడమే కాకుండా ఇన్నింగ్స్ చివర్లో బ్యాట్‌తోనూ విరుచుకుపడే సత్తా అతడి సొంతం. అందుకే అతడిని చెన్నై జట్టు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల అండర్-19 క్రికెట్లో రాణించిన జూనియర్ క్రికెటర్లకు ఐపీఎల్ వేలం మొత్తానికి కలిసొచ్చిందనే చెప్పాలి.
Also Read
- Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
- James Hopes: "గెలిచే మ్యాచ్‌లను చేతులారా పాడుచేసుకున్నాం".. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
- Kumar Sangakkara: "వైభవ్‌తో క్రికెట్ ముచ్చట్లు పెట్టను".. బుడ్డోడి సీక్రెట్ లీక్ చేసిన రాజస్థాన్ హెడ్ కోచ్..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
తాజావార్తలు
-
Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
-
Axar Patel: మిచెల్ స్టార్క్‌తో చర్చ.. ఆసక్తికర సమాధానం చెప్పిన అక్షర్ పటేల్!
-
PEDDI Trailer: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్టింగ్‌కు టైం ఫిక్స్.. మెగా మాస్ జాతర ఏ టైంకి షురూ అవుతుందో తెలుసా?
-
Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..