Jasprit Bumrah: టీ20 వరల్డ్‌కప్‌కు దూరం.. బీసీసీఐ అధికార ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah Ruled Out Of T20 World Cup: వరుసగా గాయాలపాలవుతున్న భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు తరఫున బరిలోకి దిగుతాడా? లేక దూరమవుతాడా? అనే విషయంపై కొన్ని రోజుల నుంచి మిస్టరీ నెలకొంది. ఇప్పుడు ఈ మిస్టరీకి తెరదించుతూ.. వరల్డ్‌కప్‌కి బుమ్రా దూరం అయ్యాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బుమ్రాకి వైద్యం అందిస్తోన్న నిపుణుల బృందం.. అతడు వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశాలు లేవని నిర్ధారించిందని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడ్ని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.
నిజానికి.. కొంతకాలం నుంచి వీపు గాయంతో బాధపడుతున్న బుమ్రా, ఆస్ట్రేలియా సిరీస్‌తో జట్టులోకి పునరాగమనం ఇవ్వడంతో, కచ్ఛితంగా వరల్డ్‌కప్ ఆడుతాడని అంతా అనుకున్నారు. కానీ, అతనికి గాయం తీవ్రం అవ్వడంతో బ్రేక్ తప్పలేదు. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. వరల్డ్‌కప్‌కి ఇంకా సమయం ఉంది కాబట్టి, అప్పటివరకూ విశ్రాంతి ఇస్తే కోలుకుంటాడని భావించారు. మేనేజ్‌మెంట్ కూడా అతడు కోలుకోవాలని అనుకుంది. ఎందుకంటే, బుమ్రా భారత జట్టులోనే అత్యుత్తమైన బౌలర్. అతనిలాంటి వాడు దూరమైతే.. అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే, టోర్నీలోపు కోలుకోవాలని బలంగా కోరుకున్నారు. కానీ, బీసీసీఐ తాజా ప్రకటనతో బుమ్రా వరల్డ్‌కప్‌లో ఆడబోవడం లేదని తేలిపోయింది.
Also Read
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
కాగా.. అక్టోబర్ 16వ తేదీ నుంచి టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. తొలుత క్వాలిఫయ్యర్ మ్యాచెస్ జరగనున్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 23వ తేదీ నుంచి అసలైన సమరం ప్రారంభమవుతుంది. ఆరోజు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. మరోవైపు.. బుమ్రా స్థానంలో ఎవరిని తీసుకుంటారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!