Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
- భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్
- జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చిన బీసీసీఐ
- బుమ్రా రీఎంట్రీ ఇచ్చేది ఎపుడో చెప్పిన బీసీసీఐ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌కు బుమ్రాను ఎంపిక చేయలేదు. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనకు బుమ్రా తిరిగి జట్టులో చేరతాడని స్పష్టం చేశాడు.
ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ జూన్ 6 నుంచి ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. అనంతరం జూన్ 14 నుంచి ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్‌లకు ప్రకటించిన జట్లలో జస్ప్రీత్ బుమ్రా పేరు లేకపోవడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. దీనిపై స్పందించిన అజిత్ అగార్కర్.. ‘బుమ్రా ప్రస్తుతం తన వర్క్లోడ్పై పని చేస్తున్నాడు. ఇంగ్లండ్ టూర్‌కు అతడు తిరిగి వస్తాడు’ అని తెలిపాడు. ఇక సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా టెస్టు మ్యాచ్‌కు విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు టెస్టు జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రిషభ్ పంత్‌ను టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించగా.. కేఎల్ రాహుల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే పంత్‌కు టెస్టు జట్టులో స్థానం మాత్రం దక్కింది. కానీ వన్డే జట్టులో మాత్రం నిరాశే ఎదురైంది.
Also Read
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
- PV Sindhu: క్రీడా రంగంలో ఏఐ విప్లవం.. అథ్లెట్ల కోసం ‘టెంపుల్’ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్.. ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు!
- Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన బుడ్డోడు..
- Vaibhav Sooryavanshi: "వాటిని నేను తలకెక్కించుకోను.. నా టార్గెట్ అదే".. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
దేశీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశాలు కల్పించింది. స్పిన్నర్ మనవ్ సుతార్, టాలెస్ట్ పేసర్ గుర్నూర్ బ్రార్ టెస్టు జట్టులో తొలి సారి చోటు దక్కించుకున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే వన్డే జట్టులో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం లభించింది. ఇషాన్ కిషన్‌ను రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. భారత్ టెస్టు జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా.. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. వన్డే జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్ వంటి సీనియర్ ఆటగాళ్లు కొనసాగుతున్నారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూనే, సీనియర్ల వర్క్‌లోడ్‌ను జాగ్రత్తగా నిర్వహించే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోందని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
-
Kantamaneni Ravi Shankar: పంచభూతాలపై టాలీవుడ్ లో కొత్త సినిమా
-
CM Vijay: సీఎం విజయ్‌కి షాక్ ఇచ్చిన మిత్రపక్షాలు.. ‘రెండు ఆకుల’ రాజకీయంలో దళపతి వెనకడుగు!
-
Peddi: తమిళ్, మలయాళ బాక్సాఫీస్‌పై ‘పెద్ది’ దండయాత్ర మొదలు!
-
Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!