Yashasvi Jaiswal: ముంబై అంటేనే శివాలెత్తుతున్న జైస్వాల్.. బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది!
- ముంబై అంటేనే శివాలెత్తుతున్న జైస్వాల్
- ముంబై బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది
- 70 మ్యాచ్‌లలో 2336 రన్స్ చేసిన జైస్వాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో యశస్వి జైస్వాల్ పేరు వినగానే అగ్రెసివ్ బ్యాటింగ్ గుర్తుకు వస్తుంది. ఇన్నింగ్స్ ముందునుంచే బౌలర్లపై విరుచుకుపడడం అతడి శైలి. పవర్‌ప్లేలో బౌండరీల వర్షం కురిపిస్తూ.. అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌పై జైస్వాల్ ప్రదర్శన మరింత భీకరంగా ఉంది. జైస్వాల్ ఇటీవలి గణాంకాలు చూస్తే.. ముంబై బౌలర్లపై ఎలా రెచ్చిపోతున్నాడో స్పష్టంగా తెలుస్తోంది.
ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌పై యశస్వి జైస్వాల్ 9 ఇన్నింగ్స్ ఆడి 373 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉంది. అతడి సగటు 53.28గా ఉండగా.. స్ట్రైక్ రేట్ 187.43గా ఉంది. ఈ గణాంకాలు చూస్తే ముంబైపై జైస్వాల్ ఎంత దూకుడుగా ఆడుతున్నాడో అర్థమవుతుంది. ఇటీవల ఫామ్ కూడా అద్భుతంగా ఉంది. చివరి ఐదు ఇన్నింగ్స్‌లో 124, 10, 104 నాటౌట్, 13, 77 నాటౌట్ స్కోర్లు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండడం అతని స్థిరత్వానికి నిదర్శనం. మొత్తానికి ముంబై అంటేనే జైస్వాల్ శివాలెత్తుతున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో కూడా ఈ డామినేషన్ కొనసాగుతుందా? లేక ముంబై బౌలర్లు అతన్ని అడ్డుకుంటారా? అన్నది చూడాలి.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం రాత్రి గౌహతిలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెచ్చిపోయాడు. 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యశస్వి ముందునుంచి రాజస్థాన్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రదర్శన ద్వారానే టీమిండియాలోకి వచ్చాడు. ఇప్పటివరకు 70 మ్యాచ్‌లలో 2336 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యశస్వి అత్యధిక స్కోర్ 124.
తాజావార్తలు
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
-
Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
ట్రెండింగ్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?