Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్‌గా స్టాట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 క్రికెట్లో ప్రతి జట్టుకు ఆల్‌రౌండర్ల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత మూడు సంవత్సరాలుగా భారత్ తరఫున శివమ్ దూబే, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలు బ్యాట్, బాల్‌తో జట్టుకు కీలక సేవలు అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ ముగ్గురికి సంబందించిన 2024-2026 వరకు టీ20 ప్రదర్శనల గణాంకాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా శివమ్ దూబేను ‘మోస్ట్ అండర్రేటెడ్ ఆల్‌రౌండర్’గా అభిమానులు పేర్కొన్నారు.
శివమ్ దూబే:
2024లో శివమ్ దూబే బ్యాట్‌తో 296 పరుగులు చేయడంతో పాటు బంతితో 2 వికెట్లు తీశాడు. 2025లో 291 పరుగులు, 12 వికెట్లు సాధించి మెరుగైన ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చాడు. 2026లో మరింత మెరుగ్గా రాణిస్తూ 377 పరుగులు, 9 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో వేగంగా పరుగులు చేయడంలో దూబే కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అక్షర్ పటేల్:
అక్షర్ పటేల్ మాత్రం బ్యాట్, బాల్ రెండింట్లోనూ నిలకడైన ప్రదర్శన కనబరిచాడు. 2024లో 506 పరుగులు, 37 వికెట్లు తీసి అద్భుత ఆల్‌రౌండ్ రికార్డు నమోదు చేశాడు. 2025లో 446 పరుగులతో పాటు 22 వికెట్లు సాధించగా.. 2026లో ఇప్పటివరకు 209 పరుగులు, 28 వికెట్లు తన పేరుపై నమోదు చేశాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో అక్షర్ జట్టుకు ప్రధాన ఆయుధంగా కొనసాగుతున్నాడు.
హార్దిక్ పాండ్యా:
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గత మూడు సంవత్సరాల్లో స్థిరమైన ప్రదర్శన చేశాడు. 2024లో 352 పరుగులు, 24 వికెట్లు సాధించిన హార్దిక్.. 2025లో 302 పరుగులు, 12 వికెట్లు పడగొట్టాడు. 2026లో 286 పరుగులు, 13 వికెట్లు నమోదు చేశాడు. కీలక సమయాల్లో మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యంతో హార్దిక్ ఇప్పటికీ భారత జట్టుకు అత్యంత కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
మరింత గుర్తింపు దక్కాల్సింది:
అయితే ఈ గణాంకాల ఆధారంగా సోషల్ మీడియాలో శివమ్ దూబేకు మరింత గుర్తింపు రావాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తమ అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు కీలక బలంగా నిలుస్తున్నారు. ఒక్క గణాంకాల ఆధారంగా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్ అని తేల్చడం కంటే.. మ్యాచ్‌ల ప్రభావం, ప్రత్యర్థి స్థాయి, కీలక సందర్భాల్లో చేసిన ప్రదర్శన వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!