Yashasvi Jaiswal: ముందే ప్లాన్ చేశా, లెక్కలేసుకొని మరీ చితకొట్టా.. ఆసక్తికర విషయాలు చెప్పిన జైస్వాల్!
- ఐపీఎల్ 2026లో దూసుకెళుతోన్న రాజస్థాన్
- రాజస్థాన్ విజయంలో యశస్వి జైస్వాల్ కీలక పాత్ర
- 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) దూసుకెళుతోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో విజయాలు అందుకుంది. మంగళవారం రాత్రి గౌహతిలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ 27 పరుగుల తేడాతో గెలిచింది. రాజస్థాన్ విజయంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు. 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం తన బ్యాటింగ్ ప్లాన్‌పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవర్‌ప్లేలో తీసుకున్న నిర్ణయాలు మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేశాయని వెల్లడించాడు. ముందుగానే ప్లాన్ చేసి ముంబై బౌలర్లపై దాడి చేశామని చెప్పాడు. వైభవ్ సూర్యవంశీ, తాను లెక్కలేసుకొని మరీ చితకొట్టామని చెప్పుకొచ్చాడు.
‘పవర్‌ప్లేలో కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఉండటంతో నా మైండ్‌లో ముందుగానే ఒక ప్లాన్ వేసుకున్నా. ఏ ఓవర్లను టార్గెట్ చేయాలి, ఎవరిపై దాడి చేయాలి అన్నది ఆలోచించాను. దీపక్ చాహర్ బౌలింగ్‌కు రాగానే అతడిపై దాడి చేయొచ్చని అనుకున్నాను. తర్వాత జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కు వచ్చాడు. బుమ్రాను వైభవ్ టార్గెట్ చేస్తే బాగుంటుంది, నేను ఇంకొకరిని చూసుకుంటాను అని అనుకున్నాను. ఇలా ఎవరిపై దాడి చేయాలి, ఏ షాట్లు ఆడాలి అన్నది నిరంతరం ఆలోచిస్తూ మ్యాచ్‌లో పూర్తిగా ఫోకస్ పెట్టాను. మూడు ఫార్మాట్లలో ఆడడం అంత ఈజీ కాదు. కానీ ప్రతి సారి నా ప్రిపరేషన్‌లో నేను ఎలా మెరుగుపడాలో, ఏమి చేయాలో అని ఆలోచిస్తాను. నా షాట్లను మేరుపర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్రతి వికెట్‌కు ఏ షాట్లు సరిపోతాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. నేను ప్రాక్టీస్ చేసి.. వాటినే మ్యాచులో ఆడుతా’ అని యశస్వి జైస్వాల్ చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: TVK Chief Vijay: టీవీకే విజయ్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ మనతోనే..!
‘ముందే వేసుకున్న ప్లాన్‌తో పాటు పరిస్థితిని అర్థం చేసుకుని షాట్లు ఆడతాను. జట్టుకు ఏం అవసరమో అదే చేయాలని చూస్తాను. నా ఆటను ఎప్పటికప్పుడు మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఏ షాట్ అవసరమో దాన్ని ఆడేందుకు ప్రయత్నిస్తాను. జట్టు ప్రయోజనాలే నాకు ముఖ్యం. వైభవ్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు చాలా కష్టపడుతున్నాడు. అతన్ని చూసి నేను కూడా ప్రేరణ పొందుతున్నాను. మేము తరచూ మాట్లాడుకుంటూ ఎలా ఆడాలి అనే విషయంపై చర్చిస్తుంటాం. నువ్వు ఫ్రీగా ఆడు అని నేను ప్రోత్సహిస్తాను. వైభవ్ ఆటను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. ఎవరి సలహాలు అవసరం లేకుండా తనంతట తానే అద్భుతంగా ఆడగలడు’ అని జైస్వాల్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. నటి ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!