Vaibhav Sooryavanshi Earnings: ఐపీఎల్ 2026లో వైభవ్ ఎంత సంపాదించాడో తెలుసా?.. లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
- క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వైభవ్
- 15 ఏళ్ల వయసులోనే 'ఆరెంజ్ క్యాప్'
- ఐపీఎల్ 2026లో వైభవ్ ఎంత సంపాదించాడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi IPL 2026 Salary: ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే టోర్నీలో అత్యధిక పరుగులు సాధించి ‘ఆరెంజ్ క్యాప్’ గెలుచుకున్న ఈ యువ బ్యాటర్.. తన ఆటతోనే కాకుండా భారీ ఆదాయంతో కూడా వార్తల్లో నిలిచాడు. ఈ సీజన్లో వైభవ్ మొత్తం ఆదాయం రూ.2.5 కోట్లకు పైగా ఉంది. ఐపీఎల్ 2026 ద్వారా వైభవ్ ఎంత సంపాదించాడో ఓసారి చూద్దాం.
ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ప్రాంచైజీ వైభవ్ సూర్యవంశీని రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. 2026 సీజన్లో కూడా అతడిని అదే ఫీజుకు రిటైన్ చేసుకుంది. కేవలం మ్యాచ్ ఫీజుతోనే కాకుండా అద్భుత ప్రదర్శనల ద్వారా కూడా వైభవ్ భారీగా సంపాదించాడు. ఈ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 776 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతని బ్యాటింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ వరకు చేరుకుంది. ఐపీఎల్ 2026 ముగింపు వేడుకల్లో వైభవ్ సూర్యవంశీకి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. వాటితో పాటు భారీ నగదు బహుమతులు కూడా అందుకున్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డుకు రూ.15 లక్షలు, ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) అవార్డుకు రూ.10 లక్షలు, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డుకు రూ.10 లక్షలు + టాటా సియెర్రా కారు, సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ అవార్డుకు రూ.10 లక్షలు (72 సిక్సర్లు), ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డుకు రూ.10 లక్షలు వైభవ్ సూర్యవంశీకి దక్కాయి. అవార్డుల ద్వారానే వైభవ్ మొత్తం రూ.55 లక్షలు సంపాదించాడు. మ్యాచ్ ఫీజుతో మరో రూ.1.20 కోట్లు దక్కాయి.
ఐపీఎల్లో ప్రతి మ్యాచ్‌కు ఆటగాళ్లకు ప్రత్యేక మ్యాచ్ ఫీజు కూడా లభిస్తుంది. ఒక్కో మ్యాచ్‌కు వైభవ్‌కు రూ.7.5 లక్షలు చెల్లించారు. అతను మొత్తం 16 మ్యాచ్‌లు ఆడటంతో మ్యాచ్ ఫీజు రూపంలోనే రూ.1.20 కోట్లు సంపాదించాడు. సీజన్ మొత్తం అద్భుత ప్రదర్శనలు చేసిన వైభవ్ అనేక మ్యాచ్‌ల్లో ప్రత్యేక అవార్డులు అందుకున్నాడు. ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్, మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వంటి అవార్డులకు ఒక్కోసారి రూ.1 లక్ష చొప్పున నగదు బహుమతి దక్కింది. వీటి ద్వారా కూడా అతనికి అదనపు ఆదాయం లభించింది.
రెటైనర్ ఫీజు రూ.1.10 కోట్లు, మ్యాచ్ ఫీజు రూ.1.20 కోట్లు, అవార్డుల ద్వారా వచ్చిన రూ.55 లక్షలు, ఇతర మ్యాచ్ డే బోనస్‌లను కలిపితే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్లో రూ.2.5 కోట్లకు పైగా సంపాదించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌ను శాసిస్తూ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. భవిష్యత్ భారత క్రికెట్‌కు పెద్ద ఆశాకిరణంగా నిలుస్తున్నాడు. మైదానంలో పరుగులు, అవార్డులు, ఆదాయం.. అన్ని రంగాల్లోనూ ఈ యువ సంచలనం ఇప్పుడు పెద్ద సెన్సేషన్.
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!