Vaibhav Sooryavanshi: భారత జట్టులో తీవ్ర పోటీ.. వైభవ్ సూర్యవంశీకి అప్పుడే ఛాన్స్ అవసరమా?
- భారత క్రికెట్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ
- ముంబై ఇండియన్స్‌పై 14 బంతుల్లో 39 రన్స్
- టీమిండియాలో ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐకి మాజీల సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి కాలంలో భారత క్రికెట్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘వైభవ్ సూర్యవంశీ’. దేశవాళీ, ఐపీఎల్ వైభవ్ రాణిస్తుండడంతో.. టీమిండియాలో ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐకి మాజీలు, ఫాన్స్ సూచిస్తున్నారు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్.. ముంబై ఇండియన్స్‌పై చెలరేగాడు. 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సులతో 39 రన్స్ చేశాడు. 15 ఏళ్ల వైభవ్ ప్రపంచ టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనే సిక్సర్లు బాదడంతో మరోసారి అతడిని భారత జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగాయి. అయితే సూర్యవంశీని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలా? లేదా మరికొంత సమయం ఇవ్వాలా? అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది.
ప్రస్తుతం భారత జట్టులో ఓపెనింగ్ స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లు ఇప్పటికే మూడు ఫార్మాట్లలో నిరూపించుకుని జట్టులో స్థానం సంపాదించారు. మరోవైపు ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా రేసులోనే ఉన్నాడు. వీరందరూ ఐపీఎల్‌కే పరిమితం కాకుండా.. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించి టీమిండియాలోకి అడుగుపెట్టిన వారే.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Hardik Pandya: ఆ ఆట, షాట్స్ చూసి ఆశ్చర్యపోయా.. వైభవ్ సూర్యవంశీకి అంతా మంచే జరగాలి!
వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నప్పటికీ.. ఇంకా అంతర్జాతీయ స్థాయికి అవసరమైన అనుభవం సంపాదించాల్సి ఉందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఐపీఎల్‌లో ఒకటి రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటం వేరే విషయం అని, అంతర్జాతీయ క్రికెట్‌లో నిరంతరంగా రాణించడం పెను సవాలే అని చెబుతున్నారు. భారత క్రికెట్ అభిమానులు కొత్త ప్రతిభను త్వరగా టీమిండియాలో చూడాలని కోరుకోవడం సహజమే. కానీ జట్టు అవసరాలు, ఆటగాడి సిద్ధత, అనుభవం వంటి అంశాలు కూడా చాలా ముఖ్యం. తొందరపడి అవకాశమిస్తే.. ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. అదే సరైన సమయంలో ఛాన్స్ ఇస్తే దీర్ఘకాలం జట్టుకు సేవలందించే అవకాశముంది. సూర్యవంశీకి భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా కనిపిస్తున్నప్పటికీ.. అతడిని వెంటనే జాతీయ జట్టులోకి తీసుకునే విషయంలో బీసీసీఐ, సెలెక్టర్లు సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్‌తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్‌లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్‌తో అల్టిమేట్ యాక్షన్ ?
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!