Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
- ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన
- 9 ఇన్నింగ్స్‌లలో 400 పరుగులు
- తొలి ఆటగాడిగా వైభవ్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పవర్ హిట్టింగ్‌కు పేరుగాంచిన ఈ యువ ఆటగాడు.. ఈసారి నిలకడను తన బలంగా మార్చుకుని టోర్నమెంట్‌లో టాప్ రన్-స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌లలో 400 పరుగులు చేశాడు. అతడి సగటు 44.44 కాగా.. స్ట్రైక్‌రేట్ 238.09గా ఉంది. ఈ సీజన్‌లో 400 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ స్కోర్లు వరుసగా 52, 31, 39, 78, 0, 46, 8, 103, 43గా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో తన నిలకడను చూపుతున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తరఫున పంజాబ్ కింగ్స్‌పై కేవలం 16 బంతుల్లో 43 పరుగులు చేసి మరోసారి తన దూకుడును చూపించాడు. మాజీ క్రికెటర్లు మురళి కార్తీక్, మోహిత్ శర్మలు సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొహిత్ మాట్లాడుతూ.. ‘ప్రతి స్టేడియంలో ఒకే స్థాయి ప్రేమ, ఆదరణ పొందిన ఆటగాడు ఎంఎస్ ధోనీ మాత్రమే. ఇప్పుడు అదే స్థాయి క్రేజ్‌ను సూర్యవంశీ పొందుతున్నాడు. వైభవ్ బాగా ఆడుతున్నాడు. అలవోకగా సిక్సులు బాదడం చూస్తుంటే.. చాలా ముచ్చటేస్తుంది’ అని పేర్కొన్నాడు. ధోనీతో పోలికలు రావడం అతని ప్రతిభకు మరో నిదర్శనం. వైభవ్ ప్రదర్శన ఐపీఎల్ 2026లో ఒక పెద్ద హైలైట్‌గా నిలుస్తోంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ భరిత విజయం సాధించింది. చివరి 6 ఓవర్లలో 71 పరుగులు అవసరమైన సమయంలో డొనోవన్ ఫెరీరా (52 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. శుభమ్ దూబె (31 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభంలో వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడి ఐదు సిక్సులతో బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అలాగే యశస్వి జైస్వాల్ (51) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మధ్యలో చాహల్ (3/36) వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. అయినప్పటికీ ఫెరీరా, దూబె జోడి చివర్లో మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు.
తాజావార్తలు
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?