Vaibhav Sooryavanshi: ‘ఇది చాలా అవమానకరం’.. వైభవ్ సూర్యవంశీని అతడితో పోల్చడం ఏంటి?
- సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వైభవ్ విశ్వరూపం
- సూర్యవంశీని షాహిద్ ఆఫ్రిదీతో పోల్చిన యూసుఫ్
- మండిపడుతున్న టీమిండియా ఫాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netizens Trolls Mohammad Yousuf For Compare Vaibhav to Afridi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపిస్తున్న ఈ బుడ్డోడు.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విశ్వరూపం చూపించాడు. 29 బంతుల్లో 97 పరుగులు బాది మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును తృటిలో మిస్ చేసుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ దిగ్గజాలు అతడిని సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్‌మన్ వంటి లెజెండ్స్‌తో పోల్చుతున్నారు. అయితే పాకిస్థాన్ మాజీ స్టార్ బ్యాటర్ మహ్మద్ యూసుఫ్ మాత్రం వైభవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వైభవ్ సూర్యవంశీ తనకు యువ షాహిద్ ఆఫ్రిదీని గుర్తు చేస్తున్నాడని మహ్మద్ యూసుఫ్ పేర్కొన్నాడు. ’15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే యువ షాహిద్ ఆఫ్రిదీ గుర్తుకు వస్తున్నాడు. ఎలాంటి భయం లేకుండా ఆడటం, దూకుడు, ఎనర్జీ అన్నీ అచ్చం ఆఫ్రిదీలానే ఉన్నాయి. సూర్యవంశీకి మంచి భవిష్యత్తు ఉంది’ అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆఫ్రిదీ కూడా తన కెరీర్ ప్రారంభ దశలోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. 1996లో తన తొలి వన్డే ఇన్నింగ్స్‌లోనే కేవలం 37 బంతుల్లో సెంచరీ బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు దాదాపు 18 ఏళ్ల పాటు చెక్కుచెదరలేదు.
Also Read
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కూడా అదే తరహా నిర్భయ ఆట తీరుతో ప్రపంచ క్రికెట్లో సంచలనం సృష్టిస్తున్నాడని మహ్మద్ యూసుఫ్ భావించాడు. అయితే సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు మాత్రం ఈ పోలికను వ్యతిరేకించారు. ‘వైభవ్‌ను ఆఫ్రిదీతో పోల్చడం అవమానకరం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘సచిన్, బ్రాడ్‌మన్‌లతో పోల్చుతుంటే.. యూసుఫ్ మాత్రం ఆఫ్రిదీ అంటాడేంటి’ అని మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు. ఇద్దరిలోనూ ఉన్న దూకుడు సామ్యమే యూసుఫ్ ఉద్దేశమని నెటిజెన్స్ అంటున్నారు.
ఇక నేడు జరిగే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ వికెట్ కీలకంగా మారనుంది. మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ లాంటి టాప్ బౌలర్లు బుడ్డోని ఎలా కట్టడి చేస్తారన్నది ఆసక్తికర అంశంగా మారింది. ఇప్పటికే బుమ్రా, స్టార్క్, కమిన్స్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లపై తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన వైభవ్.. ఇప్పుడు గుజరాత్ బౌలర్లకు కూడా సవాల్ విసరనున్నాడు. ప్రస్తుతం అతడు చూపిస్తున్న ఫామ్ చూస్తుంటే.. ఐపీఎల్ 2026 పూర్తిగా సూర్యవంశీదే అని అనిపిస్తోంది.
15-year-old cricket sensation #Vaibhav Sooryavanshi reminds me of @SAfridiofficial young, fearless, explosive, full of energy. The future is here! 🔥🏏 #Cricket #IPL2026
— Mohammad Yousaf (@yousaf1788) May 28, 2026
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!