IPL 2026-SRH: ఎస్‌ఆర్‌హెచ్ నుంచి కీలక అప్‌డేట్.. సన్‌రైజర్స్‌లోకి ముంబై ఇండియన్స్ పేసర్!
- ఎస్‌ఆర్‌హెచ్ నుంచి కీలక అప్‌డేట్
- సన్‌రైజర్స్‌లోకి సఫారీ పేసర్ కోయెట్జీ
- ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన కోయెట్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ గెరాల్డ్ కోయిట్జీని జట్టులోకి తీసుకున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. గాయం కారణంగా టోర్నీకి దూరమైన డేవిడ్ పైన్ స్థానంలో గెరాల్డ్‌కు ఎస్‌ఆర్‌హెచ్ అవకాశం ఇచ్చింది. మిగిలిన సీజన్ కోసం కోయెట్జీ ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఆడనున్నాడు.
డేవిడ్ పేన్ కాలివేళ్ల వద్ద గాయం కావడంతో ఈ సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో గెరాల్డ్ కోయిట్జీని రూ. 2 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మంచి అనుభవం ఉన్న కోయిట్జీ.. ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ దళానికి బలం చేకూర్చనున్నాడు. కోయెట్జీ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరఫున 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20 మ్యాచ్‌లు ఆడి.. మొత్తం 67 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 2024లో ముంబై తరఫున 10 మ్యాచ్‌లు, 2025లో గుజరాత్ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: SRH vs CSK: నేడు ఉప్పల్ మైదానంలో ఆసక్తికర పోరు.. ధోనీ దిగుతాడా?, మ్యాచ్ సజావుగా సాగేనా?
డేవిడ్ పేన్ 2026లో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. డెబ్యూ మ్యాచ్‌లో బెంగళూరుపై 3 ఓవర్లలో 2/35 గణాంకాలతో మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ రజత్ పటిదార్, వికెట్ కీపర్ జితేష్ శర్మ వికెట్లు తీసుకున్నాడు. అయితే తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతాపై ఒక్క వికెట్ కూడా తీయలేదు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ ఐదు మ్యాచ్‌లు ఆడి.. రెండు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. టీమ్ నెట్ రన్ రేట్ +0.576గా ఉంది.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!