SRH vs CSK: నేడు ఉప్పల్ మైదానంలో ఆసక్తికర పోరు.. ధోనీ దిగుతాడా?, మ్యాచ్ సజావుగా సాగేనా?
- ఉప్పల్ మైదానంలో ఎస్‌ఆర్‌హెచ్ vs సీఎస్‌కే మ్యాచ్
- ఉప్పల్ స్టేడియంలో ధోనీ బరిలోకి దిగుతాడా?
- వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్ సజావుగా సాగేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Will MS Dhoni Return IPL 2026 with SRH vs CSK: ఐపీఎల్ 2026లో నేడు ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అమీతుమీ తేల్చుకోనున్నాయి. మిడ్ టేబుల్‌లో ఉన్న ఈ రెండు జట్లు తమ తమ స్థానాలను మెరుగుపరుచుకోవడానికి ఈ మ్యాచ్‌లో విజయంను అత్యంత కీలకంగా భావిస్తున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో రెండు గెలవగా.. సీఎస్‌కే కూడా రెండు విజయాలు అందుకుంది. అయితే ఎస్‌ఆర్‌హెచ్, సీఎస్‌కే మ్యాచ్ నేపథ్యంలో అభిమానుల దృష్టి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఉప్పల్ స్టేడియంలో దిగుతాడా?, వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్ సజావుగా సాగేనా? అనే వాటిపై ఉన్నాయి.
గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు ఆడలేదు. సీఎస్‌కే తొలి 5 మ్యాచ్‌ల్లో ఆడని మహీ.. ఈ మ్యాచ్‌లో అయినా ఆడతాడా లేదా అన్నది ఆసక్తిగా ఉంది. రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌కు చేరుకున్న ధోనీ.. ఉప్పల్ మైదానంలో ప్రాక్టీస్ కూడా చేశాడు. మహీ రాకతో మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ధోనీ ప్రాక్టీస్ చూస్తే మాత్రం ఈరోజు ఆడే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ ధోనీ ఆడేది లేనిది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. రెండు వరుస విజయాలతో ఫామ్‌లోకి వచ్చిన చెన్నై.. సన్‌రైజర్స్‌ను ఓడించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు చాలా తక్కువ. కొన్ని ప్రాంతాల్లో మేఘావృతం ఉన్నప్పటికీ.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో అప్పుడప్పుడు వచ్చే సమ్మర్ షవర్స్ ఈ మ్యాచ్‌ను ప్రభావితం చేసే అవకాశాలు లేవు. మ్యాచ్ సమయంలో తేమ సుమారు 45 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బౌలర్లకు, ముఖ్యంగా స్పిన్నర్లకు బంతిని పట్టుకోవడం కష్టమవుతుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోనుంది.
Also Read: Shubman Gill: గ్రీన్ బ్యాటింగ్‌తో కంగారు పడ్డా.. ఆ ఇద్దరినీ అడిగి మరీ బంతినిచ్చా!
మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్‌లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుతుండగా.. మ్యాచ్ ప్రారంభానికి సమయానికి 27 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ పగటి వేడి ప్రభావం ఆటగాళ్ల శారీరక సామర్థ్యాన్ని పరీక్షించనుంది. ఉప్పల్ పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఎండల కారణంగా పిచ్ వేగంగా, బౌన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో హై స్కోరింగ్ మ్యాచ్ కావచ్చని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!