SRH Playoffs Chances: టాప్ లేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇంకా ఒకే ఒక్క విజయం!
- ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు
- పంజాబ్ కింగ్స్‌పై 33 పరుగుల తేడాతో విజయం
- పట్టికలో టాప్ లేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH Playoffs Chances in IPL 2026: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జోరు కొనసాగుతోంది. బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఎస్ఆర్హెచ్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (55), హెన్రిచ్ క్లాసెన్ (69) అర్ధ సెంచరీలు బాదారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఆరంభంలో దూకుడుగా ఆడినా.. మిడిల్ ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. చివరికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. కూపర్ కనోలీ (107 నాటౌట్) పోరాటం వృధా అయింది.
ఈ గెలుపుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లి.. ప్లేఆఫ్స్ బెర్తుకు మరింత చేరువైంది. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో 7 విజయాలు సాధించిన ఎస్ఆర్హెచ్.. 14 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. సొంత మైదానంలో ఇది హైదరాబాద్‌కు నాలుగో విజయం కావడం విశేషం. ప్రస్తుతం సన్‌రైజర్స్‌కు ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అందులో ఒక్క విజయం సాధించినా.. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తు దాదాపు ఖాయం కానుంది. ఇక రెండు విజయాలు సాధిస్తే.. 18 పాయింట్లతో అధికారికంగా ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కించుకుంటుంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
పట్టికలో 18 పాయింట్స్ సాధిస్తే అదనపు ప్రయోజనం ఉంటుందన్న విషయం తెలిసిందే. అగ్ర స్థానంలో ఉన్న రెండు జట్లు క్వాలిఫైయర్-1లో తలపడుతాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడినా ఫైనల్ చేరేందుకు క్వాలిఫైయర్-2 రూపంలో మరో ఛాన్స్ ఉంటుంది. అందుకే టీమ్స్ టాప్-2లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఎస్ఆర్హెచ్ రెండు విజయాలు సాధిస్తే టాప్-2లో ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి. చూడాలి మరి సన్‌రైజర్స్ ఇదే జోరు కొసనాగిస్తుందో లేదో.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్‌తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్‌కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్‌కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!