Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
- ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ఓటమి
- ఓటమిపై నిరాశ వ్యక్తం చేసిన జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్
- తక్కువ స్కోర్ చేసినా కచ్చితంగా గెలుస్తామనుకున్నాం
- అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill Reaction on GT Loss To RCB in IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ఓటమిపాలైన తర్వాత గుజరాత్ టైటాన్స్ (జీటీ) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన నిరాశను వ్యక్తం చేశాడు. తాము 180-190 పరుగుల స్కోరు చేసి ఉంటే.. మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారేదని అభిప్రాయపడ్డాడు. 150-160 పరుగులు చేసినా ఫైనల్ మ్యాచ్ కాబట్టి కచ్చితంగా గెలుస్తామనుకున్నాం అని, పవర్‌ప్లేలో వికెట్స్ తీయకపోవడంతో మ్యాచ్ తమ చేతుల్లో నుంచి జారిపోయిందని చెప్పాడు. ఫైనల్లో ఆర్సీబీ మెరుగైన క్రికెట్ ఆడిందని అంగీకరిస్తూనే, తమ జట్టు ప్రదర్శనపై కూడా గిల్ సంతృప్తి వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2026 ఫైనల్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. పిచ్ బాగుందని, ఆరంభంలో మూడు నుంచి నాలుగు ఓవర్ల వరకు మాత్రమే పేసర్లకు కొంత సహకారం లభించిందని తెలిపాడు. ‘మేము 180-190 పరుగుల చేసి ఉంటే మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉండేది. మొదటి కొన్ని ఓవర్లలో బంతి దూసుకొచ్చింది. ఆ సమయంలో మేము కీలక వికెట్లు కోల్పోయాం. దాంతో ఇన్నింగ్స్ మధ్యలో మా జట్టు మొమెంటమ్ కోల్పోయింది. మేము ఆశించిన స్థాయిలో పరుగుల వేగాన్ని పెంచలేకపోయాం. ఫైనల్ మ్యాచ్ కావడంతో 150-160 పరుగుల స్కోరు కూడా సరిపోతుందని అనుకున్నాం. పవర్‌ప్లేలో రెండు లేదా మూడు వికెట్లు తీస్తే మేము మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చేవాళ్లం. కానీ ఆర్సీబీ బ్యాటర్లు పవర్‌ప్లేలో స్వేచ్ఛగా పరుగులు సాధించారు. అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది’ అని గిల్ వివరించాడు.
Also Read
- Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
- Rajat Patidar: ధోనీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
- Virat Kohli: ఈరోజు నా కల నిజమైంది.. ఈ విజయాన్ని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోను.. కింగ్ కోహ్లీ భావోద్వేగం!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
ఆర్సీబీని పవర్‌ప్లేలో కట్టడి చేయడంలో విఫలమవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. ‘ఆర్సీబీని 50-55 పరుగులకే పరిమితం చేసి ఉంటే మాకు ఇంకా అవకాశం ఉండేది. కానీ పవర్‌ప్లేలో 15-20 పరుగులు ఎక్కువ ఇచ్చాం. ఆ దశలోనే మ్యాచ్‌పై వారు పట్టు సాధించారు. మేము టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ దళాల్లో ఒకటిగా నిలిచాం. తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన తర్వాత కూడా మేము వెనక్కి తగ్గలేదు. జట్టుగా ఒకరినొకరు ప్రోత్సహించుకున్నాం. చిన్న చిన్న అంశాల్లో మెరుగుపడేందుకు నిరంతరం కృషి చేశాం. అదే మమ్మల్ని ఫైనల్ వరకు తీసుకొచ్చింది’ అని అన్నాడు.
ఫైనల్ ఓటమి బాధ కలిగించినా, మొత్తం సీజన్ ప్రదర్శనపై తాను సంతోషంగా ఉన్నానని గుజరాత్ కెప్టెన్ గిల్ వెల్లడించాడు. ‘ఐపీఎల్ ట్రోఫీ గెలవలేకపోవడం నిరాశ కలిగించింది. కానీ ఈ సీజన్లో జట్టు చూపిన పోరాట పటిమపై గర్వంగా ఉంది. క్రికెట్లో ఎప్పుడూ మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఉంటాయి. మేము ట్రోఫీ గెలిచినా కూడా కొన్ని విషయాల్లో ఇంకా మెరుగుపడాలని అనుకునేవాళ్లం. ఇప్పుడు ఆ అంశాలపై మరింత దృష్టి పెడతాం’ అని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026 ఫైనల్లో ఓటమిపాలైనా.. గుజరాత్ ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచి మరోసారి తమ బలాన్ని చాటుకుంది. కెప్టెన్ గిల్ నాయకత్వంలో జట్టు భవిష్యత్తులో మరింత బలంగా తిరిగి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
-
Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
-
Mega 158 : నేటి నుండి పొల్లాచ్చిలో మెగా 158.. ఏమి చేస్తున్నారంటే?
-
Rajat Patidar: ధోనీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
-
Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!