Shubman Gill: అదే మా కొంపముంచింది.. ఓ సమయంలో ఏడుపొచ్చింది!
- క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్
- ఆర్సీబీ చేతిలో 92 పరుగుల తేడాతో చిత్తు
- అదే మా కొంపముంచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill About Gujarat Titans Loss To RCB in IPL 2026 Qualifier 1: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ (జీటీ)కు భారీ షాక్ తగిలింది. మంగళవారం రాత్రి ధర్మశాల వేదికగా జరిగిన కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమితో నేరుగా ఫైనల్‌కు వెళ్లే అవకాశాన్ని జీటీ చేజార్చుకుంది. క్వాలిఫయర్-2 రూపంలో ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్‌లో చేసిన తప్పులు జట్టును తీవ్రంగా దెబ్బతీశాయని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అంగీకరించాడు. ఫీల్డింగ్ తమ కొంపముంచిందని చెప్పాడు. ఈ మ్యాచ్‌ను త్వరగా మర్చిపోవాలని, మోహాలీలో కొత్త ఆరంభం చేయాలని చూస్తున్నాం అని గిల్ చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. ‘మేము 12వ, 13వ ఓవర్ వరకు బాగానే ఉన్నాం. ఆ తర్వాతే అంతా మారిపోయింది. మా ఫీల్డింగ్ స్థాయికి తగ్గట్టుగా లేదు. కొన్ని కీలక క్యాచ్‌లు వదిలేశాం. గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా నిరాశపరిచింది. ఆ తప్పులే మ్యాచ్‌ను మాకు దూరం చేశాయి’ అని తెలిపాడు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఇచ్చిన క్యాచ్‌లను జీటీ ఫీల్డర్లు రెండుసార్లు వదిలేశారు. దాంతో అతడు 39 బంతుల్లో 93 పరుగులతో చెలరేగిపోయాడు. మరోవైపు కొన్ని బౌండరీలు కూడా గుజరాత్ ఫీల్డర్లు ఆపలేకపోయారు. దాంతో అదనపు రన్స్ వచ్చాయి.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
‘ఇలాంటి మ్యాచ్‌లను త్వరగా మర్చిపోయి ముందుకు వెళ్లాలి. ఇప్పుడు మోహాలీలో కొత్త ఆరంభం చేయాలని చూస్తున్నాం. ఫీల్డింగ్ లోపాలను సరిచేసేందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మేము ఇప్పటికే టీమ్ మీటింగ్స్‌లో, ప్రాక్టీస్ సెషన్లలో ఈ విషయాలను చర్చిస్తూనే ఉంటాం. కానీ ఈరోజు మా రోజు కాదు. జట్టులో ఇంటెన్సిటీ ఉంది. అయితే ఒత్తిడి పరిస్థితుల్లో మేము మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. ఈ గ్రౌండ్లో పవర్‌ప్లే రన్స్ చేస్తే ఎంతటి టార్గెట్‌నైనా ఛేజ్ చేయవచ్చు. ఇక్కడ బంతి బాగా వస్తోంది. అవుట్‌ఫీల్డ్ కూడా వేగంగా ఉంటుంది. కాబట్టి మంచి ఆరంభం లభించి ఉంటే మ్యాచ్ మరోలా ఉండేదేమో. పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం మమ్మల్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఆ సమయంలో ఏడుపొచ్చినంత పనైంది’ అని శుభ్‌మన్ గిల్ భావోద్వేగానికి గురయ్యాడు.
స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఔటైన తీరు గురించి కూడా గుజరాత్ కెప్టెన్ గిల్ స్పందించాడు. ‘అలాంటి డిస్మిసల్ చాలా అరుదుగా చూస్తాం. అది నిజంగా దురదృష్టకరం’ అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ అనూహ్యరీతిలో ఔటవ్వడం జీటీ ఛేదనపై ప్రభావం చూపింది. ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్న ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ దిశగా దూసుకెళ్తుండగా.. గుజరాత్ టైటాన్స్ మాత్రం ఇప్పుడు క్వాలిఫయర్-2పై ఫోకస్ పెట్టింది. ఈ ఓటమి నుంచి త్వరగా కోలుకుని మరోసారి బలంగా తిరిగి రావాలని జీటీ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!