Shreyas Iyer Captaincy: శ్రేయాస్ అయ్యర్‌కు కాదు.. భారత జట్టుకే భారీ నష్టం!
- ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న శ్రేయాస్
- క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా శ్రేయాస్
- అయ్యర్ నాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్న విశ్లేషకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ 2026లో కెప్టెన్సీ, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు సారథ్యం వహిస్తూ.. వరుస విజయాలు అందిస్తున్నాడు. పీబీకేఎస్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో 4 విజయాలు అందుకోగా, ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక నాలుగు ఇన్నింగ్స్‌లలో 18, 50, 69, 66 పరుగులతో 203 రన్స్ చేశాడు. ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకుని నిపుణుల ప్రశంసలు అందుకుంటున్నాడు. పలు ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు అయ్యర్ నాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
మాజీ భారత స్పిన్నర్ ఆర్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘కెప్టెన్సీ, బ్యాటింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లో శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్నాడు. అయినా భారత జట్టు నాయకత్వ ప్రణాళికల్లో లేకపోతే.. అది అయ్యర్‌కు కాదు.. భారత జట్టుకే నష్టం. శ్రేయాస్ నాయకత్వ సామర్థ్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది’ అని సూచించారు. మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కూడా అయ్యర్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘ప్రస్తుతం శ్రేయస్ లాంటి కెప్టెన్సీ ఎవరూ చేయడం లేదు. ఫీల్డింగ్, బ్యాటింగ్‌లోనూ అతను అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రతి విభాగంలోనూ అతనే నంబర్ వన్’ అని కొనియాడాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Moeen Ali PSL vs IPL: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పి పీఎస్‌ఎల్‌కు.. అసలు కారణం ఏంటో చెప్పిన మొయిన్ అలీ!
మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ… ‘కెప్టెన్సీ వల్ల శ్రేయస్ అయ్యర్ ఆట మరింత మెరుగైంది. టాక్టికల్ అవగాహనతో పాటు నిలకడైన బ్యాటింగ్ ప్రదర్శన అతన్ని ప్రూవెన్ లీడర్‌గా నిలబెట్టాయి. శ్రేఐస్ జట్టుకు కీలక ఆటగాడు’ అని పేర్కొన్నాడు. వెస్ట్ ఇండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ కూడా అయ్యర్ నాయకత్వంపై ప్రశంసలు గుప్పించాడు. ‘శ్రేయస్ జట్టులో విజయం సాధించే నమ్మకాన్ని తీసుకొచ్చాడు. ఐపీఎల్ 2026లో పంజాబ్ అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఈ స్టార్ ఆడిగాడి ప్రదర్శన అద్భుతంగా ఉంది’ అని వ్యాఖ్యానించాడు. మొత్తంగా శ్రేయస్ కెప్టెన్సీపై క్రికెట్ దిగ్గజాల నుంచి వస్తున్న ఈ ప్రశంసలు అతని నాయకత్వ ప్రతిభను మరింత స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో భారత జట్టుకు కీలక నాయకుడిగా ఎదగగల సామర్థ్యం అతనిలో ఉందని నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!