Moeen Ali PSL vs IPL: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పి పీఎస్‌ఎల్‌కు.. అసలు కారణం ఏంటో చెప్పిన మొయిన్ అలీ!
- ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కీలక నిర్ణయం
- ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పి పీఎస్‌ఎల్‌కు అలీ
- అసలు కారణం ఏంటో చెప్పిన మొయిన్ అలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ప్రపంచంలోనే బెస్ట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ (ఐపీఎల్)ను వదిలి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎఎల్)లో ఆడాలని నిర్ణయించుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఐపీఎల్, పీఎస్‌ఎల్ షెడ్యూల్‌లు ఒకే సమయంలో ఉండడంతో.. విదేశీ ఆటగాళ్లు ఒక లీగ్‌ను మాత్రమే ఎంచుకోవాల్సి వస్తుంది. చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్‌కే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అయితే మొయిన్ అలీ మాత్రం భిన్నంగా పీఎస్‌ఎల్‌లో ఆడడానికే మొగ్గు చూపాడు.
తాజాగా ఒక పోడ్కాస్ట్‌లో మాట్లాడిన మొయిన్ అలీ.. ఐపీఎల్‌ను కాదని పీఎస్‌ఎల్‌లో ఆడడానికి గల కారణాలను వెల్లడించాడు. ‘నా వయసు ఇప్పుడు 38. ఇంకనూ నేను మంచి ప్రదర్శన చేయాలనుకుంటున్నాను. నా కెరీర్‌ను సాధ్యమైనంత ఎక్కువ కాలం కొనసాగించాలని ఉంది. పీఎస్‌ఎల్ చిన్న టోర్నమెంట్ కావడం నా కుటుంబానికి, నాకు అనుకూలంగా ఉంది. అలాగే కరాచీ టీమ్ కూడా నా నిర్ణయంకు ప్రాధాన్యత ఇస్తోంది’ అని అలీ తెలిపాడు. గత ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ తరఫున ఆడిన అలీకి పెద్దగా అవకాశాలు రాలేదు. రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్.. అతడిని కేవలం 6 మ్యాచ్‌లలో మాత్రమే ఆడించింది. అందులోనూ అతనికి బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా రాలేదు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
కేకేఆర్ జట్టులో ఆడడంపై స్పందించిన మొయిన్ అలీ… ‘గత సీజన్‌లో నేను ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేదు. బ్యాటింగ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. నేను ఎక్కువగా మైదానంలో ఉండాలని, బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నాను. కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ.. మంచి క్రికెట్ ఆడుతున్నానని భావిస్తున్నాను. కేకేఆర్ నాకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు’ అని చెప్పాడు. పీఎస్‌ఎల్‌లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్న అలీ.. సంవత్సరానికి రూ.2.14 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. ‘ఎక్కడా శాశ్వత స్థానం ఉండదు. కానీ నేను నా ఆటను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలని ఉంది. పీఎస్‌ఎల్‌లో ఆడాలనే కోరిక నాకు చాలా కాలంగా ఉంది. అయితే షెడ్యూల్ క్లాష్ కారణంగా ఇప్పటివరకు సాధ్యపడలేదు’ అని పేర్కొన్నాడు. కెరీర్‌ను కొనసాగించడం, కుటుంబానికి సమయం కేటాయించడం, అలాగే ఎక్కువ అవకాశాలు దక్కడం వంటి కారణాలతో అలీ ఈసారి ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?