Manoj : మంచు మనోజ్ ఈ నడుమ ఫైర్ మీద ఉంటున్నాడు. ఎవరు ఎలాంటి చిన్న కామెంట్ చేసినా సరే దానికి స్ట్రాంగ్ ఆన్సర్ ఇస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో మనోజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భైరవం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ టీమ్ తాజాగా ఓ ప్రోగ్రామ్ కు వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో యాంకర్ శివ మైక్ పట్టుకుని మనోజ్ ను ఓ ప్రశ్న వేస్తాడు. అన్న ఒక ప్రశ్న అంటూ అడగబోతాడు. ఇంతలో మనోజ్ అందుకుని.. ఏ రెండో ప్రశ్నకు నువ్వు ఉండవా అంటూ సెటైర్ వేస్తాడు. ఆ తర్వాత శివ ఏదో ప్రశ్న వేస్తాడు. అది మ్యూట్ లోపెట్టేశారు.
Read Also : Kolly Wood : స్పెషల్ వీడియోలతో అదరగొడుతున్న యంగ్ డైరెక్టర్స్..
అయితే దానికి మనోజ్ సమాధానం ఇస్తూ.. ‘కావాలనే కాంట్రవర్సీ చేయాలని అనుకుని వచ్చి ఏదో మాట్లాడుతారు. ఏ మరి మీ తప్పులను ఎందుకు ప్రశ్నించొద్దు. నువ్వు ఉండేది. పీఆర్సీలోనే కదా. అక్కడ ఒక అమ్మాయిని లవ్ పేరుతో చీట్ చేశావ్.. ఆ అమ్మాయి పేరు’ అంటూ ప్రోమోలో చెప్తాడు. అక్కడితోనే కట్ చేశారు. మొత్తానికి యాంకర్ శివకు గట్టి వార్నింగ్ ఇచ్చేశాడు మనోజ్. అయితే శివ ఏ ప్రశ్న వేశాడు.. మనోజ్ ఎందుకు అంత ఫైర్ అయ్యాడు అనేది పూర్తి ప్రోమో రిలీజ్ అయితేనే తెలుస్తుంది. ఇక భైరవం సినిమాను ఏప్రిల్ లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.