RR vs RCB: ఆర్ఆర్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్.. భువీ-వైభవ్ పోరు కోసం ఆసక్తిగా ఫాన్స్!
- గువాహటి వేదికగా బెంగళూరు, రాజస్థాన్ మ్యాచ్
- అందరి కళ్లూ భువీ-వైభవ్ పోరుపైనే
- మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా మరికొన్ని గంటల్లో గువాహటి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆడిన అన్ని మ్యాచ్‌లలో గెలిచిన బెంగళూరు, రాజస్థాన్ టీమ్స్ తలపడుతుండడంతో.. ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గువాహటిలో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీలలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. గత మ్యాచ్‌లో బుమ్రా-వైభవ్ పోరు మాదిరే.. ఈరోజు భువీ-వైభవ్ పోరుపైనే అందరి కళ్లూ ఉన్నాయడంలో సందేహం లేదు.
ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అతని గైర్హాజరీ జట్టుకు కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఆర్సీబీ బౌలింగ్ విభాగం మాత్రం బలంగానే ఉంది. భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ వంటి టాప్ బౌలర్లతో ఆర్సీబీ బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌లను కట్టడి చేస్తే రాజస్థాన్ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోవచ్చు. ఇక ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మలతో బెంగళూరు బ్యాటింగ్ కూడా బాగుంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతౌల్యంతో ఉంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్, జైస్వాల్ ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఆర్సీబీ బౌలర్లైన భువనేశ్వర్, డఫీలను ఎలా ఎదుర్కొంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్‌మయెర్లతో బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా, నాండ్రీ బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ ఉన్నారు. మరో హైలైట్ పోరాటం సందీప్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య ఉండనుంది. కోహ్లీ వంటి స్టార్ బ్యాటర్‌ను సందీప్ ఎలా అడ్డుకుంటాడన్నది మ్యాచ్ ఫలితంపై కీలకంగా మారవచ్చు.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు