మార్కెట్ మోసం కేసులో సెబీ మాజీ చీఫ్ మాధబీ పూరి బుచ్‌కు భారీ ఊరట లభించింది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు లోక్‌పాల్ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆమెపై వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాల్లేవని కొట్టిపారేసింది. అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవిగా తెలిపింది. ఈ మేరకు లోక్‌పాల్ ఉత్తర్వులో పేర్కొంది. ఆరోపణలు కేవలం ఊహలు, అంచనాలేనని తేల్చి చెప్పింది.
ఇది కూడా చదవండి: Operation Sindhoor: దేశభక్తిని చాటేలా ‘ఆపరేషన్ సింధూర్’ సాంగ్
గత సంవత్సరం తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేసింది. అదానీ గ్రూప్‌తో మాధబీ పూరి బుచ్‌కు, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. తాజాగా ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. సరైన ఆధారాలు లేవని తేల్చింది. బుచ్… మార్చి 2, 2022న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. తన పదవీకాలం పూర్తయిన తర్వాత ఈ సంవత్సరం ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు.
ఇది కూడా చదవండి: Israel: హమాస్ కొత్త చీఫ్ ముహమ్మద్ సిన్వర్ హతం.. నెతన్యాహు ప్రకటన