Salman khan : బాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ చాలా రోజుల తర్వాత పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్. డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మార్చి 31న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తల్లిదండ్రుల వివాహం గురించి ఆయన మాట్లాడారు. మా ఇంట్లో ఏ రోజు కూడా మతం అనేది సమస్యగా లేదు. మా తల్లిదండ్రులు కూడా మతం విషయంలో ఎన్నడూ ఇబ్బంది పడలేదు అన్నారు.
Read Also : L2: Empuraan: మోహన్ లాల్ ‘ఎంపురాన్’’తో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం..
‘నా తల్లి హిందూ మతంలో పుట్టి పెరిగింది. మా తండ్రి ముస్లింగా పెరిగారు. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ మతం అనేది వారి మధ్య పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇద్దరూ వాళ్ల ప్రొఫెషన్స్ లో ఎదగాలని ఆలోచించారు తప్ప.. మతం గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. మా ఇంట్లో మతం అనే మాట పెద్దగా రాదు. అందరం కలిసి ఉంటూ హ్యాపీగా ఉంటాం. పెట్టుకున్న లక్ష్యాలను సాధించాలన్నదే మా ఉద్దేశం. అంతే గానీ మతం గురించి ఇబ్బంది పడటం మాకు ఇష్టం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు సల్మాన్ ఖాన్. ఈ నడుమ ఆయన చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్స్ ను పెంచేలా చూసుకుంటున్నారు.