ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు భారీ పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. కోల్కతా బ్యాటర్లలో సునీల్ నరైన్ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన సునీల్.. కేవలం 56 బంతుల్లోనే 109 పరుగులు చేశాడు. అతన్ని విధ్వంసకర ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 13 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత రఘువంశీ (30) పరుగులతో రాణించాడు.
Dharmapuri Arvind: దేశానికి మోడీ తప్ప ఏ గ్యారంటీ లేదు
చివరలో రింకూ సింగ్ (20) పరుగులు చేశాడు. కేవలం 9 బంతుల్లోనే 20 రన్స్ సాధించాడు. ఫిల్ స్టాల్ (10), శ్రేయస్ అయ్యర్ (11), రస్సెల్ (13), వెంకటేష్ అయ్యర్ (8) పరుగులు చేశారు. దీంతో కేకేఆర్.. భారీ స్కోరును నమోదు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ట్రెంట్ బౌల్ట్, చాహల్ కు తలో వికెట్ దక్కింది.