Preity Zinta Said I Will Bet My Life For Rohit Sharma: స్థిరత్వం, ఛాంపియన్ మైండ్‌సెట్ ఉన్న కెప్టెన్ తమ జట్టుకు అవసరం అని పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా అభిప్రాయపడ్డారు. ఐదుసార్లు ఐపీఎల్ విజేత రోహిత్ శర్మకు ఆ లక్షణాలు ఉన్నాయని, హిట్‌మ్యాన్ మెగా వేలంలో అందుబాటులో ఉంటే ఆస్తులు అమ్మైనా సరే దక్కించుకుంటాం అని అన్నారు. ఐపీఎల్ 2024కు ముంబై ఇండియన్స్ యాజమాన్యం కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి.. హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. దాంతో రోహిత్ అసహనంలో ఉన్నాడని తెలుస్తోంది. వచ్చే ఏడాది మెగా వేలం జరగనుంది. ఆ వేలంకు రోహిత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గత 16 సీజన్‌లుగా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలవని విషయం తెలిసిందే. కనీసం ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. ఐపీఎల్ 2024లో కూడా పంజాబ్ టీమ్ రాణించలేకపోతోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి.. 2 విజయాలే సాధించింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్‌తో ప్రీతీ జింటా మాట్లాడుతూ.. జట్టు వైఫల్యాలు, కెప్టెన్సీపై స్పందించారు. ‘ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి రోహిత్ శర్మ వస్తే అతడిని ఎలాగైనా దక్కించుకుంటాం. నా దగ్గరున్నదంతా బిడ్ వేస్తా. పంజాబ్ కింగ్స్ జట్టుకు స్థిరత్వం, ఛాంపియన్ మైండ్‌సెట్ ఉన్న కెప్టెన్ అవసరం’ అని ప్రీతీ అన్నారు.
Also Read: Urvashi Rautela-NTR: ఎన్టీఆర్‌తో ఊర్వశి రౌటెలా.. ఫొటో వైరల్!
ముంబై ఇండియన్స్ ప్రాంచైజీని రోహిత్ శర్మ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ 2024 ముందు ముంబై ప్రాంచైజీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి.. హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించింది. కెప్టెన్సీ పోయిన రోహిత్ అసహనంలో ఉన్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హిట్‌మ్యాన్ ముంబైని వీడుతాడని ప్రచారం జరుగుతోంది. రోహిత్ ముంబై ఫ్రాంఛైజీని వదిలేస్తాడా?, మెగా వేలంలోకి వస్తాడా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా హిట్‌మ్యాన్ వేలల్లోకి వస్తే రికార్డులు బద్దలు అవ్వడం పక్కా.