Urvashi Rautela Selfie With Jr NTR: ‘ఊర్వశి రౌటెలా’.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌లో హాట్ అండ్ గ్లామర్ లేడీగా గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లలో నటిస్తూ అలరిస్తున్నారు. గత ఏడాది వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’లో బాస్ పార్టీ అంటూ చిరంజీవితో కలిసి స్టెప్పులు వేశారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ‘NBK 109’లో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఊర్వశి తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో హాట్ టాపిక్‌గా మారింది.
జూనియర్ ఎన్టీఆర్‌తో జిమ్‌లో దిగిన ఫొటోను ఊర్వశి రౌటెలా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరవుతోంది. ‘మన ప్రియమైన, నిజమైన గ్లోబల్ సూపర్‌స్టార్ ఎన్టీఆర్ గారు. క్రమశిక్షణ, నిజాయితీ, వినయపూర్వకంగా ఉండే వ్యక్తి. మీ దయ, ప్రేరణకు కోటి ధన్యవాదాలు. మీ సింహం లాంటి వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. సమీప భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన అభిమానులు ‘దేవర చిత్రంలో ఊర్వశి ప్రత్యేక సాంగ్‌లో కనిపించనుందా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Parineeti Chopra: పరిణీతి ఈజ్ బ్యాక్.. ఆ ఊహాగానాలకు చెక్!
‘సింగ్ సాబ్ ద గ్రేట్’ సినిమాతో ఊర్వశి రౌటెలా హిందీలో ఎంట్రీ ఇచ్చారు. సనమ్ రే, హేట్ స్టోరీ 4, పాగల్ పంతి వంటి పలు సినిమాల్లో నటించినా.. అనుకున్న రేంజ్‌లో మాత్రం ఆమెకు గుర్తింపు రాలేదు. ఊర్వశి తెలుగులో ఎక్కువగా ఐటం సాంగ్స్‌లో కనిపించారు. వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కందలో తన డాన్స్‌తో కేక పెట్టించారు.
@tarak9999 garu our beloved true #GlobalSuperstar —exceptionally disciplined, honest, and refreshingly straightforward, yet so wonderfully humble. Thanks a million for your kindness and the motivation. Your lion-hearted 🦁 personality is truly admirable. Can’t wait to work with… pic.twitter.com/iysWzhpOYY
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) April 15, 2024