Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Preity Zinta Praises Shreyas Iyer And Pbks After Big Win Vs Mi In Ipl 2026

Preity Zinta: ‘సర్పంచ్ సాబ్’ సూపర్.. నీకంటే లేరెవరూ తోపు.. ప్రీతి జింటా ఆనందోత్సవం!

Published Date :April 17, 2026 , 2:16 pm
By Sampath Kumar
  • అపజయమే లేని జట్టుగా పంజాబ్ కింగ్స్
  • 5 మ్యాచ్‌లు ఆడగా.. నాలుగు విజయాలు
  • పీబీకేఎస్ యజమాని ప్రీతి జింటా ఆనందోత్సవం
Preity Zinta: ‘సర్పంచ్ సాబ్’ సూపర్.. నీకంటే లేరెవరూ తోపు.. ప్రీతి జింటా ఆనందోత్సవం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్‌ 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతోంది. ఇప్పటివరకు అపజయమే లేని జట్టుగా నిలిచింది. పీబీకేఎస్ 5 మ్యాచ్‌లు ఆడగా.. నాలుగు విజయాలు అందుకుంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైయింది. ముంబై ఇండియన్స్‌ (ఎంఐ)పై అద్భుత విజయం అందుకుని.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. వరుస విజయాల నేపథ్యంలో పీబీకేఎస్ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముంబైపై ఘన విజయం సాధించిన అనంతరం ‘సర్పంచ్ సాబ్’ సూపర్ అంటూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు.

పంజాబ్ కింగ్స్ జట్టులోని యువ ఆటగాళ్లను ప్రీతి జింటా ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఆటతీరుకు ఫిదా అయ్యారు. అతను చూపిస్తున్న మెచ్యూరిటీ జట్టుకు ఎంతో ఉపయోగపడుతోందని అభినందించారు. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. ‘మీ ఆట చూస్తే ఎంతో ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. ‘సడ్డా సర్పంచ్’ అంటూ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వాన్ని ప్రశంసించారు. శ్రేయాస్ నాయకత్వంలో జట్టు అద్భుతంగా రాణిస్తోందని, కోచ్ రికీ పాంటింగ్ మార్గదర్శకత్వం జట్టుకు కీలకమని ప్రీతి జింటా రాసుకొచ్చారు.

Also Read: Jasprit Bumrah Wicketless: బుమ్రా మెరుపుల్లేవ్.. వరుసగా ఐదో మ్యాచ్‌, నో వికెట్.. ఇక కష్టమేనా!

మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ పట్టిన అద్భుత క్యాచ్‌పై ప్రీతి జింటా ప్రత్యేకంగా స్పందించారు. ‘నేను చూసిన బెస్ట్ క్యాచ్‌లలో ఒకటి’ అంటూ ప్రశంసించారు. శ్రేయాస్.. నీకంటే లేరెవరూ తోపు అంటూ మెచ్చుకున్నారు. జట్టు ప్రదర్శన చూసి తాను చాలా ఆనందంగా ఉన్నానని, చిరునవ్వు ఆగడం లేదని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పీబీకేఎస్ సమిష్టి ప్రదర్శన, యువ ఆటగాళ్ల మెరుపులు, కెప్టెన్-కోచ్ సమన్వయం జట్టును ఈ సీజన్‌లో అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి. అభిమానుల మద్దతుతో పంజాబ్ టైటిల్ రేసులో ముందుంది. మిగిలిన 9 మ్యాచులలో 3 విజయాలు అందుకుంటే.. పీబీకేఎస్ ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IPL 2026
  • mi vs pbks
  • PBKS
  • Preity Zinta
  • Preity Zinta Instagram

తాజావార్తలు

  • Preity Zinta: ‘సర్పంచ్ సాబ్’ సూపర్.. నీకంటే లేరెవరూ తోపు.. ప్రీతి జింటా ఆనందోత్సవం!

  • MLA Pulivarthi Nani: చెవిరెడ్డికి పులివర్తి నాని వార్నింగ్.. “సినిమా చూపిస్తా”..!

  • Mumbai Indians: రోహిత్ నిరాశ.. హార్దిక్ నిరుత్సాహం.. బుమ్రా నిస్సహాయత.. ముంబైలో అంతా గందరగోళం..

  • Samrat Choudhary: బీహార్ కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి బెదిరింపులు.. ఒకరు అరెస్ట్

  • Cuba vs United States: మళ్లీ క్యూబాపై ట్రంప్ ఫోకస్..! ఆ దేశ సైన్యం ఎంత బలంగా ఉంది..? అమెరికా ముందు నిలబడగలదా..?

ట్రెండింగ్‌

  • Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

  • How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..

  • 8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X10 సిరీస్..!

  • T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!

  • Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions