Preity Zinta Hug: యాహూ.. ప్రీతి జింటా హగ్ ఇచ్చిందోచ్.. టీమిండియా స్టార్ పేసర్ సంతోషం!
- పంజాబ్, లక్నో మ్యాచ్‌కు హాజరైన ప్రీతి జింటా
- అర్ష్‌దీప్ సింగ్‌ను హగ్ చేసుకున్న ప్రీతి
- టీమిండియా స్టార్ పేసర్ సంతోషం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ ప్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్‌లో పంజాబ్ జట్టును గెలిపించిన ఆటగాడికి ఓ హగ్ ఇస్తుంటారు. ఒకప్పుడు పంజాబ్ జట్టుకు ఆడిన యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ లాంటి దిగ్గజాలకు సహా మరికొందరికి ప్రీతి హగ్ ఇచ్చారు. గతేడాది కూడా గెలుపు జోష్ లో చాలా మంది ఆటగాళ్లను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కాస్త బిజీగా ఉన్న ప్రీతి జింటా.. ఐపీఎల్ 2026లో మ్యాచ్‌లకు హాజరుకాలేదు. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు హాజరై సందడి చేశారు.
లక్నోపై విజయం అనంతరం పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా మైదానంలోకి వచ్చి ఆటగాళ్లను అభినందించారు. ఈ క్రమంలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను హగ్ చేసుకున్నారు. అర్ష్‌దీప్ ఆ క్షణాన్ని బాగా ఆస్వాదించాడు. ‘యాహూ.. ప్రీతి జింటా హగ్ ఇచ్చిందోచ్’ అంటూ ఎగిరి గంతేశాడు. దాంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ప్రీతి కూడా ఇదేంటి అన్నట్లు చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సన్నివేశం జట్టు సభ్యుల మధ్య ఉన్న బంధాన్ని, యజమాన్యం-ఆటగాళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా చూపించింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్లో ఓటమి ఎరుగని జట్టు పంజాబ్ మాత్రమే. లక్నోను ఓడించడం ద్వారా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో (11 పాయింట్స్) కొనసాగుతోంది. ఇదే ఊపుతో ముందుకు సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రీతి జింటా తన జట్టుకు అందించే మద్దతు, ఆటగాళ్లలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందని ఈ వైరల్ వీడియో ద్వారా స్పష్టమైంది.
I love this team so so much❤️❤️ pic.twitter.com/LK8K2wSevs
— xerox_ (@xeroxofKXIP96) April 20, 2026
తాజావార్తలు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!