Orry Charged Rs 2o Lakh for One Touch: ఇటీవలి రోజుల్లో బాలీవుడ్ సెలెబ్రిటీలతో ఓ వ్యక్తి ఎక్కువగా కనిపిస్తున్నాడు. స్టార్ హీరో, హీరోయిన్లను పట్టుకుని.. ఫొటోలకు పోజులిస్తున్నాడు. ఆ వ్యక్తితో ఫొటోలు దిగేందుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసక్తి చూపుతున్నారు. అతడే ‘ఓరీ’ అలియాస్ ‘ఓర్హాన్ అవత్రమణి అకా’. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓరీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడు షేర్ చేసిన ఫొటోస్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఆ ఫొటోలకు నెట్టింట లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.
హీరో, హీరోయిన్లతో ఫొటోలు దిగడం ఓరీకి ఏదో సరదా అని అనుకుంటున్నారా?. కాదు.. అలా ఫొటోస్ దిగి లక్షలు సంపాదిస్తున్నాడట. రోజుకి ఇద్దరు సెలెబ్రిటీలతో రెండు ఫొటోలు దిగి రూ.50 లక్షలు సంపాదిస్తాడట. అంటే హీరో, హీరోయిన్లతో ఫొటో దిగినందుకు రూ.25 లక్షలు చొప్పున వసూల్ చేస్తున్నాడట. తనకి ఫోటో ఇవ్వాలని అనిపిస్తే మాత్రం ఫ్రీగానే ఇస్తాడట. ఇక ఎవరైనా టచ్ చేయమని అడిగితే.. అందుకు రూ.20 లక్షలు ఛార్జ్ చేస్తాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో ఓరీ మాట్లాడుతూ చెప్పాడు.
Also Read: MS Dhoni Retirement: హార్ట్ బ్రేక్ న్యూస్.. ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై!
ఓరీకి పని చేయడం అంటే అస్సలు ఇష్టముండదట. అందుకే ఈవెంట్స్‌కి హాజరవుతూ.. ఫొటోలకు పోజులిస్తూ ఆదాయం పెంచుకుంటున్నాడట. ఈ విషయం తెలిసిన వారు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇటీవల అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వివాహ వేడుకలలో కూడా ఓరీ సందడి చేశాడు.