LSG vs MI: లక్నోకు గుడ్‌న్యూస్.. ముంబైకి దబిడిదిబిడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow Pacer Mayank Yadav Likely To Play against Mumbai: ఐపీఎల్ 2024 భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ ముంబైకి చాలా కీలకం. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ సేన గెలవాల్సిందే. లక్నో కూడా ఇది కీలకమైన మ్యాచే. కీలక మ్యాచ్ ముందు లక్నోకు ఓ గుడ్‌న్యూస్. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఫిట్నెస్ సాధించాడు.
మయాంక్ యాదవ్ ఫిట్నెస్ సాధించిన విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ ధ్రువీకరించాడు. మంగళవారం (ఏప్రిల్ 30) ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో మయాంక్ ఆడే అవకాశం ఉందని తెలిపాడు. ‘మాయాంక్ యాదవ్ ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాడు. అన్ని ఫిట్నెస్ టెస్టులు అతడు పాసయ్యాడు. ఇది మాకు గుడ్‌న్యూస్. ముంబైతో జరిగే కీలక మ్యాచ్‌లో అతడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశముంది’ అని మోర్కల్ తెలిపాడు. మయాంక్ బరిలోకి దిగితే.. ముంబైకి దబిడిదిబిడే అనే చెప్పాలి. ఎందుకంటే బుల్లెట్ బంతులతో అతడు ఆకట్టుకుంటున్నాడు.
Also Read
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
- Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
Also Read: Sunil Narine: టీమ్ మీటింగ్‌లకు సునీల్ నరైన్ రాడు: శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ 2024లో మయాంక్ యాదవ్ సంచలన వేగంతో ఆకట్టుకున్నాడు. నిలకడగా 150కి పైగా కిమీ వేగంతో బంతులేస్తున్నాడు. మయాంక్ బంతులకు స్టార్ క్రికెటర్లు సైతం షాక్ అవుతున్నారు. ఈ ఎడిషన్‌లో బెంగళూరుపై 156.7 కిమీ వేగంతో బంతిని విసిరాడు. 2024 సీజన్లో ఇదే అత్యంత వేగవంతమైన బంతి. పంజాబ్‌పై 155.8 కిమీ స్పీడ్‌తో బంతిని సంధించాడు. అయితే ఏప్రిల్ 7న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క ఓవర్ మాత్రమే వేసి.. గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. ఇపుడు మయాంక్ ఫిట్నెస్ సాధించాడు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా బిగ్ అప్డేట్.. 140 కొత్త వాహనాలకు గ్రీన్ సిగ్నల్.!
-
Samantha: ‘ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు’.. సమంత
-
India A vs Sri Lanka A: వైభవ్ సూర్యవంశీ-శ్రీలంక ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం.. మ్యాచ్ అనంతరం ఉద్రిక్తత..!
-
Pawan Kalyan: దేశం ముందా.. పార్టీ ముందా? జనసేన స్పష్టమైన సందేశం
-
Divyendu Sharma: ‘పెద్ది’ విలన్‌కి త్రివిక్రమ్ క్రేజీ ఆఫర్.. వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ లోకి మున్నా భయ్యా!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?