IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2027లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా బిజీ షెడ్యూల్, కీలక టెస్టు సిరీస్‌ల నేపథ్యంలో ఐపీఎల్లో పాల్గొనడంపై స్టార్క్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాన్ని అతడే వెల్లడించడంతో వచ్చే సీజన్లో స్టార్క్ అందుబాటుపై చర్చ మొదలైంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ తగలనుంది.
ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ జట్లకు తమ స్టార్ ఆటగాళ్ల సేవలు నిరంతరం అందుబాటులో ఉండటం పలు బోర్డులకు సవాలుగా మారుతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టు వచ్చే ఏడాది కీలక సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్‌తో మార్చి 11 నుంచి ప్రారంభం కానున్న చారిత్రాత్మక 150వ వార్షికోత్సవ టెస్టుతో పాటు యాషెస్ సిరీస్ కూడా ఆస్ట్రేలియా షెడ్యూల్లో ఉన్నాయి. వీటితో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం, రానున్న ప్రపంచకప్ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్ల పనిభారంపై క్రికెట్ ఆస్ట్రేలియా ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
Also Read
- Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
- IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
- Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
ఐపీఎల్ 2027లో తన భాగస్వామ్యంపై ఇప్పటికే కొన్ని చర్చలు జరిగాయని మిచెల్ స్టార్క్ వెల్లడించాడు. అయితే ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదని స్పష్టం చేశాడు. దీంతో వచ్చే సీజన్లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కూడా ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ మధ్య సమతుల్యత అవసరమని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 టోర్నీల్లో ఒకటని, ఇందులో ఆడటం ఆటగాళ్ల ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. అయితే జాతీయ జట్టు అవసరాలు, ఆటగాళ్ల శారీరక సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియా జట్టు భవిష్యత్తులో వరుసగా కీలక సిరీస్‌లు ఆడాల్సి ఉండటంతో ఫాస్ట్ బౌలర్ల పనిభారంపై కోచింగ్, వైద్య బృందాలు సమీక్ష చేస్తున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ చేసే ఆటగాళ్లు దీర్ఘకాలం ఫిట్నెస్ను కొనసాగించాలంటే తగిన విశ్రాంతి అవసరమని మెక్‌డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. ‘దేశం తరఫున ఆడాలా? ఫ్రాంచైజీ తరఫున ఆడాలా? అనే చర్చల కంటే ప్రస్తుతం మా ఫాస్ట్ బౌలర్లకు శరీరాన్ని తిరిగి సిద్ధం చేసుకునే సమయం ఇవ్వడం ముఖ్యం. రానున్న 20 లేదా 21 మ్యాచ్‌ల సుదీర్ఘ ప్రయాణంలో వారు అత్యుత్తమంగా రాణించేందుకు అవసరమైన ఫిట్నెస్ను సాధించాలి’ అని ఆస్ట్రేలియా కోచ్ తెలిపాడు. ఆటగాళ్లు తమ కెరీర్‌కు, జాతీయ జట్టు అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని మెక్‌డొనాల్డ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. కీలక అంతర్జాతీయ పోటీల్లో ఆస్ట్రేలియా తరఫున రాణించడమే ఆటగాళ్ల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు.
మిచెల్ స్టార్క్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2026 సీజన్ కోసం రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గాయాల కారణంగా అతడు ఆ సీజన్లో కేవలం ఆరు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. వచ్చే ఏడాది అంతర్జాతీయ షెడ్యూల్ మరింత బిజీగా ఉండటంతో ఐపీఎల్లో అతడి భాగస్వామ్యంపై అనిశ్చితి నెలకొంది. అయితే స్టార్క్ ఐపీఎల్ 2027కు దూరమవుతాడని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అతడి అందుబాటు, ఫిట్నెస్, ఆస్ట్రేలియా జట్టు షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!