Krunal vs Mukul: నీ అంతు చూస్తా.. ముకుల్ చౌదరిని బెదిరించిన కృనాల్ పాండ్య!
- చిదంబరం స్టేడియంలో ఆర్‌సీబీ, ఎల్ఎస్‌జీ మ్యాచ్
- కృనాల్ పాండ్య, ముకుల్ చౌదరి మధ్య మాటల యుద్ధం
- ముకుల్ చౌదరిని స్లెడ్జింగ్ చేసిన కృనాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాత్రి చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ మధ్యలో టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య, దేశవాళీ సంచలనం ముకుల్ చౌదరి మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వా-నేనా అన్నట్లు ఇద్దరు మాటలు కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కృనాల్ పాండ్య బౌలింగ్‌లో ముకుల్ చౌదరి ఓ భారీ షాట్ కొట్టాడు. దాంతో కొంత అసహనం వ్యక్తం చేసిన కృనాల్.. స్లెడ్జింగ్‌కు దిగాడు. ‘తర్వాతి బంతిని కొట్టి చూపించు చూద్దాం’ అని ముకుల్‌ను సవాల్ చేశాడు. ముకుల్ కూడా వెనక్కి తగ్గలేదు. కృనాల్ వేసిన తర్వాతి బంతిని బౌండరీకి తరలించాడు. అనంతరం కృనాల్ వైపు చూసి ‘మళ్లీ కొట్టా చూశావా’ అంటూ ఘాటుగా స్పందించాడు. ఈ సంఘటనతో మైదానంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. కృనాల్ అక్కడితో ఆగకుండా ‘తర్వాతి ఓవర్‌లోనే నిన్ను అవుట్ చేస్తా’ అంటూ హెచ్చరించాడు. ఇలా ఇద్దరు మధ్య ఒకరిపై మరొకరు ఫైర్ అయ్యారు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
కృనాల్ పాండ్య, ముకుల్ చౌదరి మధ్య ఘర్షణ మ్యాచ్‌లో మరింత ఉత్కంఠను తీసుకొచ్చింది. అభిమానులు కూడా ఈ సన్నివేశాన్ని ఆసక్తిగా వీక్షించారు. మ్యాచ్ మొత్తానికి ఈ సంఘటన మ్యాచ్ హైలైట్‌గా నిలిచింది. ఆటలో పోటీ, ఉత్సాహం ఎంతగా ఉందో ఈ చిన్న ఘర్షణే చెబుతోంది. ఐపీఎల్ వంటి పెద్ద టోర్నీలో ఇలాంటి హీట్ మోమెంట్స్ ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్‌మెంట్‌ను అందిస్తాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజెన్స్ తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Things are heating up between krunal pandya and mukul 🥶#RCBvsLSG pic.twitter.com/dKwwo242v2
— Nafees (@Nafees_22) April 15, 2026
తాజావార్తలు
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!