KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
- కోల్‌కతాలో అభిమానులకు అసలైన మజా
- ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్
- కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను అందించింది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే కాకుండా.. టీ20 క్రికెట్లో కూడా ప్రత్యేకంగా నిలిచింది.
టీ20 క్రికెట్ చరిత్రలో తొలిసారి ఒకే మ్యాచ్‌లో ఆరుగురు బ్యాటర్లు 50కి పైగా పరుగులు చేశారు. దీంతో ఈ మ్యాచ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లోనే 93 పరుగులు చేశాడు. మరోవైపు యువ ఆటగాడు అంక్రిష్ రఘువంశీ 44 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కామెరాన్ గ్రీన్ 28 బంతుల్లో 52 పరుగులతో అర్ధశతకం నమోదు చేశాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
248 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కూడా అద్భుత పోరాటం చేసింది. కెప్టెన్ శుభమాన్ గిల్ 85 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జోస్ బట్లర్ 57 పరుగులు చేసి జట్టులో ఆశలు రేకెత్తించాడు. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ 53 పరుగులతో రాణించాడు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు, గుజరాత్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు బాదారు. ఐపీఎల్ చరిత్రలోనే కాకుండా.. టీ20 క్రికెట్లో ఒకే మ్యాచ్‌లో ఆరుగురు బ్యాటర్లు 50కి పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
తాజావార్తలు
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?