A Fan tried to steal the match ball in KKR vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా గత శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. 16 ఓవర్ల మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 7 వికెట్లను 157 రన్స్ చేసింది. అనంతరం ముంబై 8 వికెట్లకు 139 రన్స్ చేసి ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
Also Read: RCB vs CSK: బెంగళూరు, చెన్నై మ్యాచ్ కష్టమే.. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు!
మ్యాచ్ సందర్భంగా కోల్‌కతా బ్యాటర్ కొట్టిన బంతి స్టాండ్స్‌లో పడింది. అక్కడే ఉన్న ఓ అభిమాని ఆ బంతిని దొంగిలించడానికి ప్రయత్నించాడు. బంతిని ఇవ్వకుండా.. ప్యాంట్ జేబులో వేసుకునే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన పోలీసులు.. బంతిని లాక్కొని చివాట్లు పెట్టారు. ఆపై మైదానం నుంచి బయటకు ఆ అభిమానిని వెళ్లగొట్టారు. పోలీసు దూకుడు ప్రవర్తనతో అతడు ఆశ్చర్యపోయాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ అభిమాని కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ జెర్సీని ధరించి ఉన్నాడు.
Ball pent me 🤣 pic.twitter.com/2gG8EtBizf
— Professor Sahab (@ProfesorSahab) May 13, 2024