Samantha : సమంత ఎప్పుడు ఎలాంటి చిన్న కామెంట్ చేసినా సరే సోషల్ మీడియా మొత్తం ఊగిపోతుంది. నాగచైతన్య-శోభిత పెళ్లి తర్వాత ఆమెపై సింపతీ బాగా పెరిగింది. అయితే తాజాగా సమంత చేసిన కామెంట్లు ఆమె పర్సనల్ లైఫ్ ను ఉద్దేశించి ఉన్నాయి. ప్రస్తుతం ఆమె సిడ్నీలో పర్యటిస్తోంది. అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్స్ లో పాల్గొంటోంది సమంత. తాజాగా సిడ్నీలోని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ లో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. సక్సెస్ అంటే కేవలం గెలవడం మాత్రమే కాదని చెప్పింది. ప్రయత్నించడం కూడా సక్సెస్ లో భాగమే అన్నది. అవార్డులు, రివార్డులు వస్తేనే సక్సెస్ అనుకోనని.. తనకు నచ్చినట్టు బతికితే అదే సక్సెస్ అని చెప్పింది.
Read Also : Kannappa : ‘కన్నప్ప’.. ఏం చేసినా బజ్ లేదప్పా..!
‘నా లైఫ్ లో నాకు నచ్చినట్టు బతకాలని అనుకుంటా. నాకు రూల్స్ పెడితే అస్సలు నచ్చదు. నాకు ఇష్టమైన రంగంలో రాణించాలన్నదే నా ఆశ. ఆడపిల్ల అని చెప్పి ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా ఉండు, అలా ఉండు అని రూల్స్ పెడితే నాకు నచ్చదు. లైఫ్ లో అన్ని రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించాలి. అదే నా సక్సెస్ అనుకుంటా’ అని చెప్పుకొచ్చింది సమంత. సిడ్నీలో ఉండు యువతతో ఆమె ఇంటరాక్ట్ అయ్యారు. సమంత తెలుగులో సినిమా చేసి చాలా రోజులు అవుతోంది. ఆమె మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆమె ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నా దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.