Ishan Kishan: నేను హ్యాపీగా లేను.. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ బోణి
- నేను హ్యాపీగా లేను అంటూ ఇషాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- మొదటి మ్యాచ్‌లో 38 బంతుల్లోనే 80 రన్స్ చేసిన ఇషాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) బోణి కొట్టడంపై కెప్టెన్ ఇషాన్ కిషన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ బాగా ఆడారని ప్రశంసించారు. తన వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగా లేనని చెప్పాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు పవర్‌ప్లేలో అద్భుతంగా ఆడి మంచి ఆరంభం ఇచ్చారని.. ఆ కీలక రన్స్ జట్టు విజయానికి కారణమని ఇషాన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 65 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ 9 బంతుల్లో 14 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. బెంగళూరుర్ జరిగిన మొదటి మ్యాచ్‌లో 38 బంతుల్లోనే 80 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ… ‘నా ఆట కంటే జట్టు ఆడిన విధానం నాకు చాలా సంతోషం కలిగించింది. మ్యాచ్‌కు ముందు అందరూ బాగా ఆడాలని చెప్పాను. మైదానంలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడారు. ఇది పూర్తిగా జట్టు విజయం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పవర్‌ప్లేలో అద్భుతంగా ఆడి మంచి ఆరంభం ఇచ్చారు. ఆ 80 పరుగులు మ్యాచ్‌ను మాకు విజయానికి దోహదం చేశాయి. మిగతా బ్యాటర్లు పిచ్‌ను అర్థం చేసుకుని ఆడారు. హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్‌ను బాగా ముగించారు. ఫిన్ అలెన్ లాంటి ఆటగాడిని పరుగులు చేయకుండా ఆపడం కష్టం. అదృష్టవశాత్తు త్వరగా అవుట్ అయ్యాడు’ అని చెప్పాడు.
Also Read
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
Also Read: Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!
‘మా ప్లాన్ చాలా సింపుల్, వికెట్లు తీయడమే. బౌలర్లు ఆ ప్లాన్‌ను బాగా అమలు చేశారు. యువ బౌలర్ శివాంగ్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. చిన్న మైదానం, మంచి పిచ్ ఉన్నప్పటికీ అతను బాగా బౌలింగ్ చేశాడు. రింకూ సింగ్ లాంటి ఆటగాడికి ఫ్లైట్ బంతులు వేయడం గొప్ప విషయం. అతని శ్రమకు తగిన ఫలితం దక్కింది. విజయం సాధించినా జట్టు ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ప్రతి మ్యాచ్‌ఓ మేము మా లోపాలను గుర్తిస్తున్నాం. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో మెరుగుపడాలి. ప్రతి మ్యాచ్‌లో 10-20 పరుగులు అదనంగా ఇస్తున్నాం. టీ20లో ఇది చాలా ప్రభావం చూపుతుంది. దీనిపై మేం దృష్టి పెట్టాం’ అని ఇషాన్ కిషన్ తెలిపాడు.
తాజావార్తలు
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..