Highest Run Chases: ఐపీఎల్ చరిత్రలోనే టాప్‌లో పంజాబ్, హైదరాబాద్.. ఈ టీమ్‌లకే ఎలా సాధ్యం?
- టీ20 క్రికెట్ అంటేనే దూకుడు, భారీ స్కోర్లు
- భారీ లక్ష్యాలను ఛేజ్ చేయడం అసాధ్యం
- పంజాబ్, హైదరాబాద్ టీమ్‌లకే ఎలా సాధ్యం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Highest targets chased down in IPL: టీ20 క్రికెట్ అంటేనే దూకుడు, భారీ స్కోర్లు, ఉత్కంఠభరిత ముగింపులు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ దూకుడు, భారీ స్కోర్లు మరింత ఎక్కువ అనే చెప్పాలి. ముఖ్యంగా భారీ లక్ష్యాలను ఛేజ్ చేయడం దాదాపు అసాధ్యం. కానీ కొన్ని జట్లు అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ చరిత్ర సృష్టించాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక లక్ష్యాలను విజయవంతంగా ఛేజ్ చేసిన రెండు టీమ్స్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ రెండు టీమ్స్ మరేవో కాదు.. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్. పంజాబ్, హైదరాబాద్ టాప్ రికార్డు చేజింగ్ లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం.
ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది. 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసి సెన్సేషన్ సృష్టించింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన ఛేజ్‌గా నిలిచింది. ఇదే పంజాబ్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి మరో రికార్డు సృష్టించింది. భారీ టార్గెట్లను కూడా ఎలాంటి బెరుకు లేకుండా ఛేజ్ చేసే సామర్థ్యం పంజాబ్ జట్టుకు ఉందని చెప్పడానికి ఈ రెండు మ్యాచ్‌లే ఉదాహరణ.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా తనధైన ముద్ర వేసింది. 2025లో పంజాబ్‌పై 246 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. 2026లో ముంబై ఇండియన్స్‌పై 244 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి మరోసారి సన్‌రైజర్స్ తన బ్యాటింగ్ బలం చాటుకుంది. 2026లోనే రాజస్థాన్ రాయల్స్‌పై 229 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. దాంతో రికార్డు చేజింగ్ లిస్ట్ టాప్-5లో మూడు సార్లు చోటు దక్కించుకుంది.
ఈ రికార్డులు చూస్తే.. ఆధునిక టీ20 క్రికెట్‌లో బ్యాటింగ్ ఎంతగా మారిపోయిందో స్పష్టంగా తెలుస్తోంది. ఒకప్పుడు 180-200 స్కోర్లు భారీ టార్గెట్‌గా భావించేవారు. కానీ ఇప్పుడు 230-260 స్కోర్ చేసినా గెలుస్తామనే నమ్మకం లేదు. ఓపెనర్లు పవర్‌ప్లే నుంచే దూకుడుగా ఆడటం, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగడం, ఫినిషర్లు గేమ్‌ను ముగించడం వంటి అంశాలు ఈ భారీ ఛేజింగ్‌లకు కారణంగా మారాయి. మొత్తంగా చెప్పాలంటే.. ఐపీఎల్ ఇప్పుడు పూర్తిగా బ్యాటర్ల ఆటగా మారింది. భవిష్యత్తులో ఈ రికార్డులు బద్దలయ్యే అవకాశాలు లేకపోలేదు.
తాజావార్తలు
-
Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
-
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!