Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ వేదికగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్నీ కావు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగుతున్న ఈ యువ సంచలనం, తాజాగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లోనే 3 భారీ సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన వైభవ్.. ఈ సీజన్లో కేవలం 12 ఇన్నింగ్స్‌ల్లోనే తన మొత్తం సిక్సర్ల సంఖ్యను 43కి చేర్చాడు. దీంతో ఇప్పటివరకు భారతీయ ప్లేయర్స్ పేరిట ఉన్న అత్యుత్తమ రికార్డులన్నీ కనుమరుగయ్యాయి. 2024 సీజన్లో అభిషేక్ శర్మ (42 సిక్సర్లు), 2025లో శ్రేయస్ అయ్యర్ (39 సిక్సర్లు), 2016లో విరాట్ కోహ్లీ (38 సిక్సర్లు) నెలకొల్పిన బెంచ్‌మార్క్‌లను ఈ 15 ఏళ్ల టీనేజర్ అధిగమించడం విశేషం. ఏమాత్రం భయం లేకుండా టాప్ ఆర్డర్లో రాజస్థాన్ రాయల్స్‌కు వైభవ్ ఇస్తున్న మెరుపు ఆరంభాలు, లీగ్‌లోనే అత్యంత ప్రమాదకరమైన హిట్టర్లతో అతడిని పోల్చేలా చేస్తున్నాయి. ఈ సీజన్ మొత్తానికే వైభవ్ ఆటతీరు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మరోవైపు.. వైభవ్ బ్యాటింగ్ శైలిపై రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కర ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆయన మాట్లాడుతూ.. వైభవ్ అద్భుతంగా బంతిని బాదుతున్నాడని, జట్టుకు వేగవంతమైన ఆరంభాలను అందిస్తున్నాడని కొనియాడారు. 15 ఏళ్ల వయసులో ఒక చిన్నపిల్లాడు క్రికెట్‌ను ఎంతగా ప్రేమిస్తాడో, వైభవ్ కూడా బ్యాటింగ్‌ను అంతే ఇష్టపడుతున్నాడని, గంటల తరబడి బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాడని చెప్పారు. వైభవ్ కేవలం గుడ్డిగా ఆడడు అని.. గేమ్‌ను చాలా చక్కగా అర్థం చేసుకుంటాడని తెలిపారు. తనకంటే వైభవ్ ఎంతో మెరుగైన ఆటగాడని సంగక్కర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడికి కొద్దిపాటి సాయం అందిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇక, భారతీయ బ్యాటర్లలో రికార్డు సృష్టించినప్పటికీ, ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ (2012లో 59 సిక్సర్లు) రికార్డును అందుకోవడానికి వైభవ్ ఇంకాస్త దూరంలో ఉన్నాడు. అయితే రాజస్థాన్ రాయల్స్‌కు లీగ్ దశలో ఇంకా కనీసం రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తే వైభవ్‌కు మరిన్ని అవకాశాలు దక్కుతాయి. ప్రస్తుతం అతడు ఆడుతున్న స్ట్రైక్ రేట్, నిలకడ, భయం లేని ఆటతీరు చూస్తుంటే గేల్ రికార్డును బద్దలు కొట్టడం ఈ 15 ఏళ్ల కుర్రాడికి అసాధ్యమేమీ కాదనిపిస్తోంది. ఇంత చిన్న వయసులో, ఇంత వేగంగా, అత్యంత నిలకడగా సిక్సర్లు బాదడం అనేది సాధారణ విషయం కాదు. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న రాజస్థాన్ రాయల్స్ తరఫున రాబోయే లీగ్ మ్యాచ్‌ల్లో, నాకౌట్స్‌లో వైభవ్ సూర్యవంశీ ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!