Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Story: మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ గ్రీస్ వేదికగా ఒక్కటైన సంగతి తెలిసిందే. నవంబర్ 11న అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వీరి పెళ్లి ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. మరోవైపు నవంబర్ 21న చెన్నైలో జరగనున్న వీరి గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వీరి ప్రేమ వివాహం నేపథ్యంలో ఇప్పుడు అనిరుధ్ అత్తమామల లవ్ స్టోరీ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అసలు కావ్య మారన్ తండ్రి, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ ప్రేమ కథ గురించి ఉదయనిధి స్టాలిన్ గతంలో చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించే కళానిధి మారన్ చాలా రిజర్వ్డ్గా ఉంటారు. కానీ, తమ ఉమ్మడి కుటుంబంలో మొట్టమొదటిసారిగా ప్రేమ వివాహం చేసుకుని కొత్త ట్రెండ్ సృష్టించింది ఆయనేనని ఉదయనిధి స్టాలిన్ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. కళానిధి మారన్, కావేరి దంపతులది లవ్ మ్యారేజ్ అని, వాళ్ల పెళ్లి తర్వాతే తమ ఇంట్లో ప్రేమ పెళ్లిళ్లపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. అంతకుముందు వరకు కాస్త సంప్రదాయబద్ధంగా ఆలోచించే పెద్దలు, కళానిధి మారన్ పెళ్లి తర్వాత ప్రేమ వివాహాలను చాలా సహజంగా తీసుకోవడం మొదలుపెట్టారట.
Also Read
- Mouli: టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దొంగ నా కొడుకు .. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ బ్యానర్లో మూడో సినిమా?
- Teja Sajja Engagement : తేజ సజ్జా కాబోయే భార్యను చూశారా?
- Bollywood : ఒకవైపు రణ్వీర్ సింగ్, మరోవైపు రణ్‌బీర్ కపూర్.. స్టార్ పవరా? సీక్వెల్స్ క్రేజా?
- Sai Pallavi : జుట్టు కట్ చేస్తున్నానని తెలిసి మా అమ్మ ఫోన్ కట్ చేసింది.. పెద్ద దుమారమే రేపింది
కళానిధి మారన్ వేసిన బాట తమ తరం వాళ్లకు ఎంతగానో కలిసొచ్చిందని ఉదయనిధి ఆ ఇంటర్వ్యూలో సరదాగా గుర్తు చేసుకున్నారు. “కళానిధి మారన్ వివాహం జరిగిన తర్వాత మా కుటుంబంలో వరుసగా మరో ఐదారు ప్రేమ పెళ్లిళ్లు జరిగాయి. సరిగ్గా ఆయన పెళ్లి సమయంలోనే నా ప్రేమ కథ కూడా మొదలైంది. 2001-2002 నాటికి ఇంట్లో అందరికీ ఇదొక సాధారణ విషయంగా మారిపోవడంతో, కృతికతో నా పెళ్లికి కూడా పెద్దగా అడ్డంకులు ఎదురుకాలేదు” అంటూ ఉదయనిధి నవ్వుతూ వివరించారు.
నాడు తండ్రి కళానిధి మారన్ తనకు నచ్చిన కావేరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే, నేడు కూతురు కావ్య మారన్ కూడా తన మనసుకు నచ్చిన అనిరుధ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. “అందుకే వీళ్ల లవ్ స్టోరీకి ఇంట్లో గ్రీన్ సిగ్నల్ చాలా ఈజీగా దొరికి ఉంటుంది” అంటూ నెటిజన్లు ఉదయనిధి పాత కామెంట్స్‌ను షేర్ చేస్తూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇక నవంబర్ 21న చెన్నైలో జరగనున్న అనిరుధ్ – కావ్యల రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
-
INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!
-
Mouli: టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దొంగ నా కొడుకు .. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ బ్యానర్లో మూడో సినిమా?
-
AP Elections: ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం.. రేపు పరిశీలన..
-
Koti Deepotsavam Day3 LIVE: కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!