Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Srh Vs Rr High Voltage Clash Vaibhav Suryavanshi Revenge Match Preview

SRH vs RR: బుడ్డోడు వైభవ్ vs ప్రఫుల్ హింగే.. రేపు రాజస్థాన్ సొంత గడ్డపై అసలైన ‘ప్రతీకార’ పోరు!

Published Date :April 24, 2026 , 1:41 pm
By RAMAKRISHNA KENCHE
SRH vs RR: బుడ్డోడు వైభవ్ vs ప్రఫుల్ హింగే.. రేపు రాజస్థాన్ సొంత గడ్డపై అసలైన ‘ప్రతీకార’ పోరు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

SRH vs RR: రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య హై ఓల్టేజ్ పోరు జరగనుంది. ఏప్రిల్ 13న జరిగిన మొదటి దశ మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాగ ఎలాగైన పగ తీర్చుకోవాలని రాజస్థాన్ చూస్తోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో బుడ్డోడు వైభవ్ సూర్యవంశీకి ప్రఫుల్ హింగే చుక్కలు చూయించాడు. ఏకంగా తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ దెబ్బను వైభవ్‌తోపాటు రాజస్థాన్ రాయల్స్ టీమ్ మర్చిపోలేదు. సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగే రేపటి మ్యాచ్‌లో సత్త చూపాలని తహతహలాడుతోంది.

ఇక, రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. గత బుధవారం లక్నోపై 40 పరుగుల తేడాతో విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం రాజస్థాన్ తరపున టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. 220.86 స్ట్రైక్ రేట్‌తో 254 పరుగులు చేయడమే కాకుండా రెండు సార్లు కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు బాదడం విశేషం. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (245 పరుగులు) కూడా నిలకడగా రాణిస్తున్నాడు. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ (11 వికెట్లు), ఆల్ రౌండ్ ప్రదర్శనతో రవీంద్ర జడేజా జట్టుకు కొండంత అండగా నిలుస్తున్నారు. అయితే కెప్టెన్ రియాన్ పరాగ్ ఫామ్ మాత్రం జట్టును కాస్త ఆందోళనకు గురిచేస్తోంది.

Also Read

  • Mumbai Indians Unwanted Record: ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!
  • Sanju Samson: "నా విజయ రహస్యం ఇదే".. సెంచరీ వీరుడు సంజూ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • Sanju Samson Century: ఇది కదా కావాల్సింది.. సంజూను అభినందించిన హార్దిక్ పాండ్యా, బుమ్రా, స్కై.. వీడియో వైరల్
  • Sanju Samson Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సంజు శాంసన్.. నంబర్ వన్‌గా 'కేరళ' కింగ్!

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ అటాకింగ్ బ్యాటింగ్‌నే నమ్ముకుంది. ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ఢిల్లీపై సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ అదే జోరును కొనసాగించాలని చూస్తున్నాడు. బౌలింగ్‌లో ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ వంటి యువకులు అరంగేట్రంలోనే అదరగొట్టినప్పటికీ, రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ లేకపోవడం వారి బౌలింగ్ విభాగాన్ని కాస్త బలహీనపరుస్తోంది. గత మ్యాచ్‌లో జరిగిన తప్పులను సరిదిద్దుకుని హైదరాబాద్ అటాకింగ్ బ్యాటింగ్‌ను అడ్డుకోవాలని రాజస్థాన్ వ్యూహాలు రచిస్తోంది. అటు పాయింట్ల వేటలో దూసుకుపోవాలని హైదరాబాద్, ఇటు ప్రతీకారం తీర్చుకోవాలని రాజస్థాన్ చూస్తుండటంతో ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abhishek Sharma
  • IPL 2026
  • IPL Match Preview
  • Rajasthan Royals revenge
  • SRH RR today match

తాజావార్తలు

  • SRH vs RR: బుడ్డోడు వైభవ్ vs ప్రఫుల్ హింగే.. రేపు రాజస్థాన్ సొంత గడ్డపై అసలైన ‘ప్రతీకార’ పోరు!

  • Chandragiri Elephants: చంద్రగిరిలో గజరాజుల బీభత్సం.. రైతుల కన్నీరు, లక్షల్లో నష్టం!

  • Monsoon Season: రుతుపవనాల రాకపై తీపికబురు.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటే..!

  • Supreme Court: ప్రవక్త కాలం నుంచే మసీదుల్లోకి మహిళలకు అనుమతి ఉంది.. జస్టిస్ అమానుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

ట్రెండింగ్‌

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions