SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ సూపర్ విక్టరీ..
SRH vs CSK: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. వరుసగా వికెట్లు పడటంతో సీఎస్కే కుప్పకూలింది. సంజు శామ్సన్, శివమ్ దూబే రాణించలేకపోయారు. 18 ఏళ్ల ఆయుష్ మహాత్రే (30), మాథ్యూ షార్ట్(34) మినహా ఎవ్వరూ 30 పరుగులు సైతం చేయలేకపోయారు. ఆయుష్ మహాత్రే మంచి ఇన్నింగ్స్ ఆడగా.. గాయం కారణంగా మధ్యలోనే వెనుదిరిగాడు. ఎట్టకేలకు ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో గెలిచింది. చివర్లో జేమీ ఓవర్టన్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. చివరి ఓవర్లో ప్రఫుల్ హింజ్ మరోసారి నిరూపించుకున్నాడు. లాస్ట్ ఓవర్లో ఆరు బాల్స్‌లో 18 రన్స్ కొట్టాల్సి ఉండగా.. బౌలర్ ప్రఫుల్ హింజ్ అద్భుతంగా కట్టడి చేశాడు. ఈషాన్ మలింగా మూడు వికెట్లు పడగొట్టగా.. నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీశాడు. శివాంగ్ కుమార్, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
READ MORE: Abhishek Sharma: వేగంలో సెహ్వాగ్‌నే మించిపోయాడు.. ఐపీఎల్లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర!
మరోవైపు.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్ఆర్హెచ్ 194 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 15 బంతుల్లో సంచలనాత్మక అర్ధశతకం సాధించాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లులతో 59 పరుగులు పూర్తి చేశాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ 39 బంతుల్లో 59 పరుగులు చేసి అర్ధశతకం సాధించాడు. ట్రావిస్ హెడ్ (23), నితీష్ కుమార్ రెడ్డి(12), సలీల్ అరోరా (13), శివాంగ్ కుమార్ (12) రన్స్ చేశారు. జేమీ ఓవర్టన్, అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు పడగొట్టగా, ముఖేష్ చౌదరి రెండు వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ సూపర్ విక్టరీ..
-
Abhishek Sharma: వేగంలో సెహ్వాగ్‌నే మించిపోయాడు.. ఐపీఎల్లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర!
-
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ అక్కడ కూడా ఫ్లాపేనా?
-
Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్
-
Mahesh Babu: రాజమౌళి మహేశ్‌కు పాస్‌పోర్ట్ ఇచ్చేశాడా?
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!